010223a1326. 020223-1.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀757.
నేటి…
*ఆచార్య సద్బోధన:*
➖➖➖✍️
*ఎవరు భగవంతుని యొక్క దివ్యమైన జన్మనూ, కర్మనూ యథార్థంగా తెలుసుకుంటున్నారో అట్టివారు మరణానంతరం ఆయననే పొందుతున్నారు.*
*అనురాగం, భయం, క్రోధం విడిచిన వారూ, ఆయన యందే లగ్నమై ఉన్న మనస్సు కల అనేకులు ఇట్టి జ్ఞాన తపస్సుచే పవిత్రులై భగవంతుని స్వరూపమును పొందియున్నారు.*
*ఆధ్యాత్మిక అనుభవం నిత్యజీవితంలోని అనుభవాలకు దూరంగా ఎక్కడో లేదు. మన నిత్యజీవన విధానం ఆధ్యాత్మికతతో కలిసి ఉన్నది.*
*అయితే ఆ రెంటినీ జత చేసేవి ఆదర్శం పట్ల భక్తి, ప్రార్థనలే. ఈ ప్రార్థన ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తితో కూడుకుని ఉండరాదు.*
*ప్రార్థన అవగాహనతో కూడుకుని ఉండి మన అజ్ఞానాన్ని తొలగించేదిగా ఉండాలి. హృదయ వైఖరిని గ్రహిస్తూ మనస్సుని శుద్ధి చేసేందుకు ఉపక్రమించాలి.*
*పవిత్ర హృదయాన్ని పొందగలగడం కన్నా అదృష్టం మరొకటి ఏమి ఉంటుంది. అటువంటి హృదయం దర్పణంలా ప్రకాశిస్తూ మనలను ప్రతిబింబింపజేస్తుంది.*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
No comments:
Post a Comment