Monday, February 27, 2023

సర్వత్ర పరమాత్మనే దర్శించాలి

 *సర్వత్ర పరమాత్మనే దర్శించాలి*

यो ब्रह्म विष्णु रुद्राणां भेदमुत्तम भावतः |
साधये दुदरव्याधियुक्तो भवति मानवः ||

కర్మవిపాకమనే గ్రంథంలో ఇలా ఉంది.
హరిహరులకంటే బ్రహ్మ గొప్పవాడని, బ్రహ్మ విష్ణువులకంటే ఈశ్వరుడు గొప్పవాడని, బ్రహ్మ శివులకంటే విష్ణువు గొప్పవాడని వాదించేవాడు మరు జన్మలో కడుపునొప్పితో బాధపడతాడని చెప్పారు. ఈ జన్మలో అనుభవిస్తున్న రోగాలకు, గత జన్మలో చేసిన పాపాలకు సంబంధముంది. ప్రాయశ్చిత్తం అటువంటి కష్టాలను తొలగిస్తుంది. అందుకని పరమాత్మ స్త్రీయా, పురుషుడా అనే వాదం మానివేసి ఏ రూపంలో ఉన్నా పరమాత్మ ఒక్కడే అని భావించాలి. ఎటువంటి భ్రమలకు లోనుకాకూడదు.

त्वं स्त्री त्वं पुमानसि त्वं कुमार उतवा कुमारी |
त्वं जीर्णो दंडेन वंचसि त्वं जातो भवसि विश्वतोमुखः ||

అని ఉపనిషత్తులు చెబుతున్నాయి. పరమాత్మ యొక్క ఏ రూపం గొప్పదని వాదించినా అది మూర్ఖత్వమే అవుతుంది. శివుడు గొప్పవాడా, విష్ణువు గొప్పవాడా అని మూర్ఖంగా ఆలోచించక అన్నిటిలో పరమాత్మ దర్శనం చేయాలి.

--- జగద్గురు శ్రీశ్రీ భారతీ తీర్థ మహస్వామివారు.


https://www.facebook.com/SringeriSankaraMathamNarasaraopet/

No comments:

Post a Comment