*:::::::::::: కుర్చీ :::::::::::::::*
మనం కూర్చోడానికి కుర్చీ కావాలి.
కనపడిన ప్రతి కుర్చీ మీద కూర్చోము. ఎందుకంటే కొన్నింటికి కాళ్ళు విరిగి లేదా విరగడానికి రెడీగా వుంటాయి.
నమ్మకం అనే కుర్చీ విరగడానికి రెడీగా వున్న కుర్చీ లాంటిది. కూర్చో వచ్చు . కాని ఎప్పుడు విరిగి పడి మనల్ని పడేస్తుందో తెలీదు.
సత్యం అనే కుర్చీ లో కూర్చోండి. భద్రంగా వుండండి.
ఇక్కడ కుర్చీ అంటే మనం నమ్మే సిద్ధాంతం కావచ్చు, పాటించే ధర్మం కావచ్చు, మనం అభిప్రాయాలు, ఉద్దేశాలు, మనం చదివే గ్రంధాలు. ఏవైనా కావచ్చు.
కుర్చీ కాళ్ళు అంటే మనం నమ్మిన దానిని, పాటించే దానిని సత్యం అనే మన సొంత భావనలు
సత్యం వైపు నడిపించేదే అసలైన ధ్యానం
*షణ్ముఖానంద 98666 99774*
No comments:
Post a Comment