030223a1526. 040223-1.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀759.
నేటి…
*ఆచార్య సద్బోధన:*
➖➖➖✍️
*జపాలు, ధ్యానాలు, పూజలు, యాత్రలు, అభిషేకాలు, అర్చనలు, భజనలు....చేస్తున్నవారిని దేవుడు అనుగ్రహిస్తాడా?*
*అంటే…. ‘పూజ కన్నా భూత దయ గొప్పద’ని భగవంతుడు చెప్పాడు. భూతదయలేని పూజలు గొప్ప ఫలితాలు ఇవ్వవు.*
*ఆకలి గొన్న వానికి అన్నం పెట్టాలి గానీ, అన్నం, కూరలు గురించి, వంట గురించి ఉపన్యాసం ఇస్తే ఆకలి తీరదు కదా. అలాగే భగవంతుడు చెప్పిన సత్య, ధర్మాలను పాటించాలి.*
*భూత దయను… అంటే ఇతర ప్రాణుల పట్ల దయ, క్షమలను చూపాలి. అంతే కాని, భగవంతుడిని స్తోత్రాలతో స్తుతిస్తే సరిపోదు.*
*దేవునికి ఇష్టమైన పనులను చేయాలి. అప్పుడే పూజలు చేసినా, ధ్యానాలు చేసినా, అర్చనలు చేసినా పూర్తి ఫలితం దక్కుతుంది.*
*ఇతరులను బాధ పెట్టకుండా, హింసించకుండా, కష్టపెట్టకుండా ధర్మమార్గంలో, న్యాయమార్గంలో జపతపాలు చేయాలి. అప్పుడే భగవంతుడి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందగలం.*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
No comments:
Post a Comment