*మృత్యువును ఆహ్వానించుటే ధ్యానం*
భౌతిక శరీరానికి మృత్యువు, మనం ఆహ్వానించక పోయినా సమయం ఆసన్నమైనప్పుడు , వచ్చి తన పని తాను చేసుకుని పోతుంది.
కనుక దాని గురించి మనం మాట్లాడే పనిలేదు.
ఇప్పుడు మన తెలుసు కోవలసింది మానసిక మృత్యువును గురించి.
మానసిక మరణం అంటే నేను నుండి ఎప్పటికప్పుడు మరణించడం.
గతం నుండి, మానసిక జ్ఞాపకాలనుండి మరణించడం.
అభిప్రాయాలు, ఇష్టాలు, నమ్మకాలు, ముద్రలు, మానసిక గాయాలు, నుండి మరణించడం.
నేను ఫలానా,నేను ఇది,అది అని పెంచుకున్న గుర్తింపుల నుంచి మరణం.
ధ్యానం అంటే .ఏ క్షణానికి
ఆ క్షణం మరణాన్ని ఆహ్వానించడం.
*షణ్ముఖానంద 98666 99774*
No comments:
Post a Comment