Sunday, February 5, 2023

శ్రీరమణీయం: నేను ఆత్మనై ఉన్నప్పుడు, ఆత్మదర్శనానికి దూరం చేస్తున్నది ఏమిటి ?

 💖💖💖
       💖💖 *"459"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
     
*"నేను ఆత్మనై ఉన్నప్పుడు, ఆత్మదర్శనానికి దూరం చేస్తున్నది ఏమిటి ?"*

*"మనపై ఉండాల్సిన ధ్యాసను ప్రపంచం పైకి ప్రసరించటమే మనని ఆత్మదర్శనానికి దూరం చేస్తున్న అంశం. మనం ఆత్మదర్శనం అనే స్థితిని క్రొత్తగా పొందాలి అనుకుంటున్నాం. కానీ అది మనం ఈ ప్రపంచంతో కలవకముందు ఉన్నస్థితే ! భగవాన్ శ్రీరమణమహర్షి ఇలా చెప్పారు. "ఒకడు జగాన్ని చూస్తాడు. చూడబడేవి బయట ఉన్నాయి. తనకి దూరంగా ఉన్నాయి. చూసే వస్తువు తనకు సన్నిహితంగా ఉంది." తాను చూసేవాడుగా ఉంటే తనతోనే ఉంటాడు. చూడబడే వస్తువులతో కలిసినప్పుడే జగతితోపాటు తాను కూడా విస్తరించి తనకు తాను దూరం అవుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న రోజు మనం కూడా సినిమాహాలులో విద్యార్థిలా ఉంటాం. అప్పుడు మన దృష్టి అంతా సహజస్థితి కాని సంసారంపై కాకుండా మనలోని అంతరాత్మపై ఉంటుంది. ఈ విధంగా జీవనంలో నిర్లిప్తంగా ఉండగలుగుతాం !"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*
             

No comments:

Post a Comment