Tuesday, February 14, 2023

శ్రీరమణీయం: దైవం విషయంలో మూఢ నమ్మకాలు ఎలా ఏర్పడుతున్నాయి ?

 🙏🕉🙏                    ...... *"శ్రీ"*

                 💖💖💖
      💖💖 *"466"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
     🌼💖🌼💖🌼💖🌼
           🌼💖🕉💖🌼
                 🌼💖🌼
                       🌼
*"దైవం విషయంలో మూఢ నమ్మకాలు ఎలా ఏర్పడుతున్నాయి ?"*

*"బయట మనం పూజించే పటంకానీ, విగ్రహంగానీ, బొమ్మగాని అవి మనలోని దైవానికి ప్రతిబింబాలు అన్న విషయం తెలియక పోవడంవల్ల దైవం విషయంలో అనేక మూఢనమ్మకాలు, భయాలు ఏర్పడుతున్నాయి. దైవం ఏమిటో నిజంగా అర్థమైతే ఇలా ఏర్పడే భయాలు తొలగిపోతాయి. మనకు ఏకష్టం వచ్చినా భగవంతుడితో విన్నవించుకుంటాం. మనం పూజించే దేవుని రూపానికి మన కష్టాలను ఏకరువు పెడతాం. మనం బయట పూజించే ఏ రూపమైనా, మనలోని పరమాత్మకు ప్రతిరూపమేనన్న సత్యం మనకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. అప్పుడు నాలో ఉన్న దైవమే నన్ను అనుగ్రహిస్తుందని తెలిసి స్వాంతన కలుగుతుంది. బయట ఏ విగ్రహంగా భగవంతుని చూస్తున్నామో, ఆ రూపం ముందుగా మనలోనే ఉంది. లోపల ఉన్న దైవమే మనల్ని అనుగ్రహిస్తుంది !"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*
              🌼💖🌼💖🌼
                     🌼🕉️🌼
                

No comments:

Post a Comment