*::: మనస్సు నందు కాల చలనం :::::*
భౌతిక కాలం చలించాలి అంటే వరుసగా ఒకదాని తర్వాత ఒకటిగా సంఘటనలు జరగాలి.
ఆ వరుస సంఘటనల ఆధారంగా వాటి మధ్య ఏర్పడే వ్యవధి, వాటి మధ్య వున్న సంబంధం ఆధారంగా మనం కాలాన్ని గుణిస్తాం.
*మానసిక కాలం ఎలా చలిస్తుంది.???*
మనస్సు జ్ఞాపకాలను నెమరు వేసుకుంటుంది.
అలాగే ఊహిస్తుంది.
జ్ఞాపకాలకి ,ఊహలకి ఆధారం సంఘటనలు.
జ్ఞాపకాలను నెమరు వేయడం ద్వారా వర్తమానంలో ఉన్న మనస్సు భూత కాలానికి, ఊహించడం ద్వారా భవిష్యత్తు కి మనస్సు చలించింది.
ధ్యానం ద్వారా మనస్సు నిశ్చలం అవడం అంటే నెమరు వేయడం , ఊహించడం ఆగిపోయింది అని అర్థం.
*షణ్ముఖానంద 98666 99774*
No comments:
Post a Comment