Sunday, February 5, 2023

సుఖప్రదమైన దాంపత్య జీవితానికై కొన్ని సూత్రాలు:

 1311.      1-8.    030223-6.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

 సుఖప్రదమైన దాంపత్య జీవితానికై    
                 కొన్ని సూత్రాలు:
                ➖➖➖✍️


*ఏ పనినైతే బాధ్యతగా తీసుకుంటామో, దానిలో అహంకారాన్ని అడ్డం రానీయక ముందుగా మనవైపునుండి ప్రారంభించడమే సహకారం.      దాని ఆధారంగా ఆత్మీయతను అంచనా వేయవచ్చు.* 

 *ఇంట్లో చాలా పనులుంటాయి. చాలా మటుకు వాటిని స్త్రీలే నిర్వహిస్తూ ఉంటారు. వారికి సహకరించటం భర్త బాధ్యత.*

*తనకు సమయం ఉన్నప్పటికీ ఆ పనిని భార్యే చేయాలి. నేనెందుకు చేయాలి? అనే ఆలోచనలో అహంకారం ఉంటుంది.*

*త్రాసులో ఒక వైపు అహంకారం ఉంటే ఇంకొకవైవు అసమ్మతి అనాయాసంగా పెరుగుతుంది.* 

 *ఆరవేసిన బట్టలు తీసి మడత పెట్టడం, ఇస్త్రీ చేయడం ఏమంత శ్రమ కలిగించే పనులు కావు. ఈ విధంగా సహాయం చేయడం భార్యపై ఎక్కువ ప్రభావాన్ని కల్గిస్తుంది. నిజంగానే మేమిద్దరం ఒకటే అన్న భావనను కల్గిస్తుంది. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భావం లేదనిపిస్తుంది. పనులు ఎవరు ఎంత ఎక్కువ చేసినా, తక్కువ చేసినా మగవారిలో దర్పం, స్త్రీలలో హీనత ప్రదర్శింపబడుతుంటాయి. ఇది బయటకు ప్రకటించకపోయినప్పటికీ, అంతరం ఎక్కువవుతుంది. అందువల్ల ఇంటికి రాగానే బట్టలు తీయటం, ఆరవేయటం మొదలైన భార్య పనుల్లో సహాయపడినట్లయితే సహకారమనే మెరుపు మెరుస్తుంది.* 

 *ధన వ్యవహారాలన్నీ భర్త చూస్తున్నటికీ, ఆ లెక్కలు చూడటం, డబ్బు జాగ్రత్త చేయటం వంటి విషయాలు భార్యతో సంప్రదిస్తే వారిలో విశ్వాసం దృఢపడుతుంది.* 

 *ధన వ్యవహారాలన్నింటినీ భర్త తన చేతిలోనే ఉంచుకుని, భార్యకు ఏ విషయాన్ని తెలియనీయకపోతే  అది భార్య పట్ల అవిశ్వాసాన్ని హేయభావాన్ని ప్రకటించినట్లవుతుంది. ఇంకొకవైపు భార్య ఇంటి యజమానురాలిగా కాక తాను కేవలం పనిమనిషిని మాత్రమే అనే భావాన్ని పెంచుకుంటుంది.* 

*జీవితం పట్ల     స్త్రీలు ఎక్కువ శ్రద్ధ కల్గిఉంటారు. వారికి ఇంటిపనులలో సహాయపడటం అగౌరవంగా భావించనవసరం లేదు. ఇద్దరూ కల్సిపనిచేయటం వలన ఆడుకోవడంలాగా ఆనందాన్ని కల్గిస్తుంది.* 


*సహకార భావనను ప్రదర్శించటం వల్ల ప్రేమను, విశ్వాస భావనను పెంపొందింపచేసుకోవచ్చు.* 

 *మధురమైన మాటలకు గౌరవంలో ప్రాధాన్యత ఉంటుంది. తిట్లు,* *చెడ్డమాటలు, కటువైన, అవమానకరమైన మాటలు మనగౌరవాన్ని పెంపొందించకపోగా, ఇతరుల గౌరవాన్ని కించపరుస్తాయి.*

*చెడిపోయిన పనిని పొరపాటుగా భావించి శాంతిస్వరంతో ఆ విధంగా చేసే బదులు ఈ విధంగా చేస్తే మంచిదని చెప్పాలి.* 

*దీనివలన పొరపాటును దిద్దుకునే అవకాశముంటుంది.* 

 *తిట్లతోనూ, దెబ్బలతోనూ,* *వ్యంగ్యంతోనూ, అపహాస్యం కలుపుతూ తప్పును ఎత్తి చూపినట్లయితే గౌరవానికి సంబంధించిన ప్రశ్నగా తయారవుతుంది. మొండితనం పెరుగుతుంది. తప్పుకు కారణాలు చెప్పే ప్రయత్నం మొదలౌతుంది. అందువల్ల తప్పుదిద్దుకునే ఉద్దేశ్యం పూర్తికాదు.* 

*ఇంతేకాక అవమానానికి ప్రతీకారంతీర్చుకోవాలనే కోరిక మొలకెత్తుతుంది.* 

*ప్రశంసించటం కూడా గౌరవమే! ప్రతివ్యక్తిలోనూ మంచిగుణాలు, దోషాలు రెండూ ఉంటాయి. మంచి గుణాలను అందరి ఎదుటా ప్రశంసించటం, లోపాలను ఏకాంతంలో చెవిలో చెప్పటం చేయాలి.* 

*గౌరవాన్ని ప్రేమను చిన్న పిల్లలు కూడా గుర్తించగల్గుతారు.* 

*మరి అలాంటప్పుడు పెద్దవారు వీటిని అర్ధం చేసుకోలేరని అనటం సరికాదు. ఇద్దరూ ఒకరినొకరు ఆదర దృష్టితో చూసుకోవాలి.* 

 *వీలయినంతవరకు మర్యాద పూర్వకంగా సంబోధించాలి.  స్నేహాన్ని చిన్న చిన్న బహుమతుల ద్వారా కూడా ప్రకటించవచ్చు. చిన్న పిల్లలు తండ్రి ఇంటికి వస్తే బొమ్మలు, చాక్లెట్లు తెస్తారని ఎదురుచూస్తుంటారు. తేనట్లయితే నిరాశ చెందుతారు, అదేవిధంగా స్త్రీల మనస్సు కూడా పురుషుల నుండి చిన్న చిన్న కానుకలను కోరుకుంటుంది. ముఖ్యంగా పండుగలప్పుడు, పుట్టినరోజు, పెళ్లి రోజు మొదలైన విశేష దినాలలో, ఆ కానుకలు తక్కువ ఖరీదైనవి అయినప్పటికీ ఎంతో అమూల్యమైనవిగా భావిస్తారు.* 

*దీని వలన పరస్పర సౌజన్యం వృద్ధి చెందుతుంది. పరస్పర అభివాదం చేసుకునే అలవాటు ఇంతకు ముందు రోజులలో లేనప్పటికీ వాటిని కొత్త విధానాలతో సాగించవచ్చు.* 

*ఇటువంటి విషయాలను కృతజ్ఞతా పూర్వకంగా స్వీకరించాలి. భార్యనుండి సహాయాన్ని ఆజ్ఞా పూర్వకంగా కాక అడిగి చేయించుకోవాలి.* 

*ఇంట్లోని పనులను కలిసిమెలసి చేసుకోవాలి. వీలయితే చిన్న చిన్న బజారు పనులను స్త్రీలతో చేయించాలి. దీని వలన వారికి అనుభవం సాహసం, జ్ఞాన వృద్ధి కల్గుతాయి.* 

*ఈ విధంగా ఇంటి పనులలో స్వయంగా వారే కాక, పిల్లలు కూడా పాలు పంచుకునే విధంగా చేయటం మంచి సంప్రదాయం.* 

*దాంపత్య జీవనాన్ని సరసంగానూ, ఫలవంతంగానూ చేయడంలో పురుషులు వారి దృష్టికోణాన్ని మార్చుకోవలసిన అవసరం ఉంది.* 

*చిరకాలం నుండి స్త్రీని హీనంగానూ, పురుషుడిని శ్రేష్టుడుగానూ  భావించే వారు.      కాని     నేటి స్త్రీలు    వారి చదువుతోనూ సాహసంతోనూ అది గడిచిపోయిన భావనగా మార్చారు. దానిని కాలానుగుణంగా స్తీ, పురుషులను అన్ని విధాలా యోగ్యులుగానూ, గౌరవంగానూ ప్రగతి పధంలోనికి నడిపించాలి.* ✍️
                        …సేకరణ.
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

No comments:

Post a Comment