Monday, February 27, 2023

బాధ పర్యవసానం ఏమిటి ? అది నన్ను ఏవిధంగా ప్రభావితం చేస్తుంది !?

 _*"బాధ పర్యవసానం ఏమిటి ? అది నన్ను ఏవిధంగా ప్రభావితం చేస్తుంది !?"*_

_*నిజానికి మనకంటూ సొంతంగా ఏ బాధ లేదు ! ప్రపంచంలో ఏర్పడిన ఒక సంఘటన మనసుకు తెలియటం వల్ల బాధ కలుగుతుంది. నిజానికి ఆ బాధ మనది కాదు. మనలోని తెలుసుకోవటం అనే లక్షణానికి ఏర్పడింది. కానీ దాన్ని మనకు ఆపాదించుకోవడం వల్ల ఆ బాధ మనదిగా అనిపిస్తుంది. మనకు మనం ఉన్నది ఉన్నట్లుగా ఉంటే ఏ బాధ ఉండదు. ఏదో మార్పు కనిపిస్తేనే బాధ మొదలవుతుంది. కలలో మనకు అనేక అనుభవాలు ఏర్పడుతున్నాయి. కానీ అవి భౌతికంగా మనలో ఏరకంగానూ మార్పును తీసుకురాలేవు. కనుకనే ఉదయం లేవగానే మనం కలలోని వాటిని చాలా తేలిగ్గా తీసుకుంటున్నాం. మరి మన నిత్యజీవితంలో ఎదురయ్యే అనుభవాల గురించి ఆలోచిస్తే మనసుకు ఏర్పడే భావాలు మినహా మనలో వచ్చే మార్పు కూడా ఏదీలేదు. ఈ విషయం అర్థమైతే కలను ఎలా స్వీకరిస్తున్నామో, నిత్యజీవితంలో సంఘటనలను కూడా అలాగే స్వీకరించగలుగుతాం !..

No comments:

Post a Comment