Monday, February 27, 2023

ధ్యానం స్టేజ్ లు

 [2/27, 14:53] +91 73963 92086: "ధ్యానం , స్టేజ్  -1 
ధ్యానంలో ముఖ్యంగా మూడు దశలు ఉంటాయి.
1. మెడిటేషన్
2. ధ్యానం
3. ప్రస్థాన ధ్యానం.
నేనిప్పుడు ధ్యానం లోని మొదటి దశ అయినటువంటి మెడిటేషన్ గురించి చెప్తాను.

మెడిటేషన్ చేయడానికి మొట్టమొదటిగా, సౌకర్యమైన ఆసనంలో అంటే శరీరం అనుకూలించిన అంతమేర పద్మాసనం లేదా అర్ధ పద్మాసనం, లేదా సుఖాసనం లేదా వజ్రాసనంలో గురువు గారి చిత్రపటానికి ఎదురుగా మఠం వేసుకుని కుదురుగా కూర్చోవాలి.
ధ్యాన మనో ప్రస్థాన సాధనే ధ్యేయంగా, మనసులో దృఢ సంకల్పం చేసుకోవాలి.

ఎదురుగా ఉన్నది గురుదేవుల చిత్రపటం మాత్రమే కాదని, స్వయంగా గురు దేవుల సన్నిధిలో, వారి పర్యవేక్షణలో మన సాధన జరుగుతోంది అనే స్పృహను కలిగిఉండాలి.
మౌన మూల మంత్ర జపంతో, గురుదేవుల చిత్రపటం మీద, ఫోటో ఫ్రేమ్ తో సహా మొత్తం చిత్రపటంపై ఫోకస్ చేయాలి. అంటే దృష్టిని కేంద్రీకరించాలి.
క్రమంగా ఫోటో ఫ్రేమ్ అవుటర్ ని వదిలేసి, కేవలం గురుదేవుల ముఖచిత్రంపై మాత్రమే దృష్టి కేంద్రీకరించాలి.
క్రమంగా, రెప్పవేయకుండా, దీక్షగా గురుదేవుల నుదిటి భాగం పై దృష్టిని కేంద్రీకరించాలి.
ఆ తరువాత స్టెప్పులో భ్రుకుటి మధ్యంలో అంటే రెండు కనుబొమ్మల మధ్యలో అంతే దీక్షగా దృష్టిని కేంద్రీకరించాలి.
ఆ తరువాత క్రమంగా, స్థిరంగా భృకుటి మధ్యంలోనే ఏకాగ్రంగా దృష్టిని కేంద్రీకరించడం కొనసాగాలి.
ఇదే ఆబ్జెక్టివ్ కాన్సంట్రేషన్.
దీనినే దీనినే మెడిటేషన్ లేదా సాధారణ ధ్యానం అంటారు శ్రీ గురు దేవులు.
ఈ మొత్తం ప్రాసెస్ లో,  మనసును ఒకేచోట ఒదిగి ఉండేటట్లు, ముడిచి ఉంచగల గాలి.
అప్పుడు  కనుదృష్టి , మనసు మూల మంత్ర జపం ఒకే బిందువు లోకి చేరతాయి. అప్పుడు క్రమంగా గురుదేవుల ముఖం పై వెలుగు కప్పుతుంది.
అంటే స్థిరమైన కాన్సన్ట్రేషన్ తో మనసును కేంద్రీకరించ గలిగినప్పుడు,  గురుదేవుల చిత్రపటంపై,  మొత్తంగా తెల్లని వెలుగు పరుచుకుంటుంది.
ఆ స్థితికి చేరిన తరువాత, అప్పుడు సున్నితంగా రెప్పలు వాల్చుతూ కళ్లు మూసుకోవాలి. 'టప్ ' మని కాదు.
ఇట్టి మొదటి స్టెప్పు మెడిటేషన్లో.

అంటే 'తనను '  వదిలి,  మరోచోట మనసును కేంద్రీకరించడం మే ఆబ్జెక్టివ్ మెడిటేషన్ లేదా సాధారణ ధ్యానం.
ఇది ధ్యాన మనో ప్రస్థాన దశలో మొదటి అడుగు మాత్రమే.

ఎన్నో ఆలోచనలతో, వ్యాప్త తనను కలిగిన మనస్సును,  ఒక చోటకు తీసుకు వచ్చి,  కేంద్రీకరించి, దానికి సూక్ష్మాతిసూక్ష్మ తను  కలిగించడమే ఆబ్జెక్టివ్ మెడిటేషన్లో ముఖ్యంగా జరిగేది.
కళ్ళు మూసి ఉంచి, అదే భృకుటి మధ్యలోకి  అంతర్గతంగా మనోనేత్రంతో చూస్తూ ఉండాలి.

మూసిన కళ్ళల్లో, మనో నేత్రానికి కనిపిస్తుంది గురు ముఖం. ఇదే ధ్యాన స్థానంలో మొదటి దశ...

"స్ఫూర్తి ఓం🙏
ధ్యానం 2nd స్టేజి

 మొదటి దశ ముగింపు స్థితిలో,  మనోనేత్రంతో మూసిన కళ్ళలో గురువులను చూస్తున్న స్థితి ఏదైతే ఉందో అదే స్థితి , మరింత దీక్షగా కంటిన్యూ అవ్వాలి.
ఈ సాధనలో క్రమంగా జ్ఞానేంద్రియ ప్రభావిత మనసు ఏర్పడే అవకాశం తగ్గిపోతుంది.
మనసును తనలోనే, అంతరాత్మ భావనగా, కేంద్రీకరణ సాధనే  ధ్యానం. దీనిని సబ్జెక్టివ్ మెడిటేషన్ లేదా ధ్యానం అంటారు. 

ఈ ధ్యానంలో, మనసు తన మీదే, తన self మీదే కేంద్రీకరించడం జరుగుతుంది. 
అయితే ఆబ్జెక్టివ్ మెడిటేషన్ లో బాహ్య వస్తువు లేదా ఆకారం పై మనసును కేంద్రీకరిస్తే,
 సబ్జెక్టివ్ మెడిటేషన్లో, అంతర్ముఖ భావనపై,  మనసును కేంద్రీకరించడం జరుగుతుంది.

ఆబ్జెక్ట్ మెడిటేషన్లో బ్రెయిన్ లో రిజిస్టర్ అయి ఉన్న మెమరీస్ అంటే స్మృతులు ఒకదాని తర్వాత ఒకటిగా వస్తూ ఉంటాయి. అంటే అక్కడ మెమరీ మైండ్ లేదా స్మృతి మనసు పనిచేస్తూ ఉంటుంది అన్నమాట.

కానీ సబ్జెక్టు మెడిటేషన్లో అంతర్గత స్మృతి మనస్సు లేదా భౌతిక ఇంద్రియ మనసు ఏర్పడే అవకాశం ఉండదు.
ఈ స్థితిలో పంచేంద్రియ మనసు ప్రభావం పూర్తిగా తగ్గి , సిక్స్త్ సెన్స్ పనిచేయడం మొదలవుతుంది.
ఈ స్థితిలో అంతఃచేతన అంటే మనలో అంతర్గతంగా, ఆకార మనిషికి ఆధారంగా ఉన్న జీవాత్మ ద్వారా , ఆత్మ శక్తి  స్థిరంగా,  నిలకడగా, నిరంతరం ప్రభావవంతంగా పని చేయడం ప్రారంభం అవుతుంది.
అంటే భౌతిక ఇంద్రియ ప్రభావంతో మనసు ఏర్పడడం బదులు అంతఃచేతన ప్రభావంతో అంటే ఆధ్యాత్మిక స్ఫూర్తితో మనసు ఏర్పడుతూ ఉంటుంది వ్యవహారికం లో.
ఇదే గురుదేవులు మనను పదే పదే మొదటి అడుగుగా సాధించమని బోధిస్తున్న ద మైండ్ ఆఫ్ మోరల్ సాంక్టిటీ .
ఈ సాంక్టిటీ  మనసునే వ్యావహారిక  'మరో'  మనసు అని అనుకోవచ్చు అంటారు శ్రీ గురు దేవులు.
ఎందుకంటే మామూలు భౌతిక సెన్సరీ తో ఏర్పడే మనసుతో పోల్చినప్పుడు ఈ సాంక్టిటీ  మనసు శుభ్రంగా, మలినం లేకుండా ఉంటుంది.
రెండవ దశలో ఇది మనసులో కలిగే మార్పు.
ఈ స్థితిలో ధ్యాన ప్రస్థానంలో మరో మెట్టు గా శ్రీ గురు దేవులను, అప్పటి వర్తమాన స్థితి లో ఉన్నట్లుగా మనోనేత్రంతో స్పష్టంగా దర్శించుకోగలం.
 ఈ దశను సూపర్ నాచురల్ మెడిటేషన్ గా ఆధ్యాత్మిక ధ్యాన విధానంగా భావించవచ్చును...

"ధ్యానం స్టేజి -3
[2/27, 14:54] +91 73963 92086: మెడిటేషన్ లోని రెండవ దశ అంటే ధ్యానాన్ని కొనసాగిస్తూ ముందుకు వెళితే,  మూడవ దశలో గురు దేవుల సన్నిధిలో, వారిని దర్శించుకోవడం తోపాటు, మనని మనం కూడా,  వారి సమక్షంలో మనో నేత్రంతో చూడగలుగుతాం.
అంటే గురుదేవుల సన్నిధిలో స్పష్టంగా, నన్ను నేను చూసుకోగలను అన్నమాట. 
భాష కి అందని అనుభూతి, ఆధ్యాత్మిక ఆనందం  మమేకం గా తెలిసేది ఈ మూడవ దశ లోనే.

ఇక్కడ మనం ముఖ్యంగా గమనించవలసిన కొన్ని అంశాలు ఏమంటే

1.మెడిటేషన్ లేదా సాధారణ ధ్యాన ప్రారంభం  మొట్టమొదటిగా సాధారణ భౌతిక ఇంద్రియ మనసుతో జరుగుతుంది. 
2. రెండవ దశలో అంటే ధ్యాన దశలో ఇంద్రియ మనసు వ్యవహారిక ' మరో ' మనసు గా అంటే  sanctity సాంక్టిటీ మనసు గా మారుతుంది.
3. 3వ దశలో, ఈ సాంక్టిటీ మనసు   
భావాన్ని మరియు ఆత్మ భావనను రెండింటిని ఒకటిగా కలుపగా జరిగే నూతన ఆవిష్కరణగా ఏర్పడేదే ఆత్మీకరణ మనసు. అదే  'మారు ' మనసు, మరో మనసు అని మనం గ్రహించాలి.

ఇక్కడ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే
ఈ ఆత్మీకరణ మనసు జ్ఞానేంద్రియాలకు భిన్నంగా,  గుణ వికారాలకు అతీతంగా,  అంటే ఇంద్రియ అతీత శక్తిగా ఏర్పడుతుంది. 
ఈ స్థితిలో పదార్థం యొక్క ' అసలు తెలుస్తుంది ఆధ్యాత్మికంగా. 
 అంటే యధార్థాన్ని తెలుసుకోగలుగుతాం.  ఈ స్థితిలో మనసే ఆత్మగా దర్శనం జరుగుతుంది...

"ధ్యానం స్టేజి 4 : 

మూడవ దశ లోనీ  సాధనను యధాతధంగా కొనసాగిస్తున్న క్రమంలో,  నెక్స్ట్ దశగా అంటే నాలుగవ దశలో, జ్ఞాన కోశ ప్రవేశంతో,  ఆత్మీ కరణ చెందిన మనసు సాగిపోతుంది - దివ్య ప్రస్థానం వైపు. 
అక్కడే ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది.

ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే మూడవ దశలో ఆత్మీ కరణ మనసుతో, ఆత్మ యొక్క ప్రభావం తెలుస్తుంది.

నాలుగవ దశలో అసలుసిసలు ఆత్మసాక్షాత్కారం జరుగుతుంది.
దివ్య దర్శనం అంటే ఇదే ఇదే ఇదే!
అసలు సిసలు ఆత్మసాక్షాత్కారం తో పరమాత్మ స్పర్శను అనుభూతి చెందగలుగుతాం...

"ధ్యానం స్టేజి 5 : 

ఈ నాలుగవ దశను దాటుకుంటూ, పంచమ కోశానికి ప్రస్థానం సాగిస్తే, అంటే అయిదవ దశలో పరమాత్మ దర్శనానికి దివ్య మార్గం అదే అవుతుంది. ఈ స్థితిలో అనంత స్థాయిలో కాంతి మేఘం దర్శనమిస్తుంది దివ్య ప్రస్థానంలో.
భాషకి, భావానికి ,అనుభవానికి, అనుభూతికి అతీతం అది.
ఈ సాధన లో, పరమాత్మ వైపు ప్రయాణిస్తున్న క్రమంలో, దర్శించగలం మనం ఆత్మ ప్రస్థానాన్ని.
అదే అదే నీ ఐక్యత పరమాత్మలో!
ఆ తరువాత జరిగే దే సంలీనం - పరమాత్మలో- విశ్వాత్మ లో ! 
అంతటితో అవుతుంది ధ్యాన ప్రస్థానం పరిసమాప్తి...

#రహస్యకిరణాలు

సూర్యుడు మనకు పైకి కన్పిస్తున్నట్లు వెలుగును, వేడినీ, శక్తినీ మాత్రమే అందివ్వడం లేదు. అంతకన్న గొప్ప విశేషమైన కానుకగా మనకు ప్రేరణాశక్తిని అదృశ్య వరదానంగా ప్రసాదిస్తుంటాడు. అంతఃకరణ గురించి తెలిస్తే ఇది అర్థమవుతుంది. మనకు ప్రేరణ అక్కణ్ణించే రావాలి. వేరుదారి లేదు. ఏ ఆలోచన ద్వారా ప్రేరేపించబడ్డా అది మంచిగానీ, చెడుగానీ అది ఆ సూర్యుని అదృశ్య కిరణాల ద్వారానే సంభవము. (వైజ్ఞానిక శాస్త్రవేత్తలు సైతం ధృవీకరించిన మహాసత్యము.)...
.

"'మనసుకు తెలియని, మంచి,చెడులు మనిషిలో ఉండవు. తన మనసు, తెలిసిన మనిషికి, అవి,సృష్టతే!అలా తెలుసుకునే ప్రయత్నమే--మెడిటేషన్. అదే,తనను తాను తెలుసుకోవడం. తెలిసిన, తనలోని చెడును, తొలగించుకునే ప్రయత్నమే, యోగసాధన!ప్రాణాయామం, మెడిటేషన్, యోగాసనాలు, నియమాలు, దానిలో భాగమే!యోగా ద్వారా,ఆరోగ్యం లభించడం,ఎలా ఉన్నా, అనారోగ్య, కారణాలను,కారకాలను, ఎదుర్కొనే, ఇమ్యునో శక్తి పెరిగే అవకాశం ఉంది.యోగా, ప్రి వెంట్ the ఇల్ హెల్త్.
ఆ మేరకు యోగా మెడిటేషన్, సాధన ద్వారా కలిగే, ప్రయోజనం, అందరికీ యోగ్యతే...

మహిళలు తలపై నీటి కుండలను మోసుకెళ్లేటప్పుడు, మాట్లాడటానికి ఆగినా,  చాలా జాగ్రత్తగా, నీటి కుండల మీదనే మనస్సును ఉంచుతారు. 
అదేవిధంగా, ఒక జ్ఞాని బాహ్య కార్యకలాపంలో నిమగ్నమైనప్పుడు, అతని మనస్సు ఆత్మలోనే స్థిరంగా ఉంటుంది మరియు అతని కార్యాచరణ అతని దృష్టి మరల్చదు.....

🙏🌷🙏 *శుభం భూయాత్*  🙏🌷🙏
.

సేకరణ.....

No comments:

Post a Comment