గుప్త విద్య
గత పోస్ట్ లో పశ్యంతి గురించి మాట్లాడుకున్నాం... ఇప్పుడు ఈ పోస్ట్ లో నాల్గవ శరీరం అయిన మనొమయ కోశాన్ని చేరుకున్న సాధకులు గురువు యొక్క ఆజ్ఞకు దైవానికి సంపూర్ణ సమర్పణ, ఆత్మ సమర్పణ చేసుకుంటాడు... ఇది అతి ముఖ్యమైన అంశం...ఇది ఇప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు కానీ తర్వాత పోస్ట్ లలో అర్థం కావచ్చు..
#నిజానికి_విద్య_ఒకరు_నేర్పేది_కాదు_ఒకరు_నేర్చుకునేది_కాదు. అది ఒక అద్భుతమైన సంఘటన!!!
ఒకటి రెండు ఉదాహరణలు చెప్పుకుందాం... నాకు తెలిసిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి పెళ్లి అయి ఒక ఆరు నెలలు కూడా కావడం లేదు... ఒక రోజు రాత్రి కలలో ఒక స్వామి కనిపించి ఏం జీవితం స్వామి నీది, నీతో పని ఉంది రా... వచ్చేయి శ్రీశైలం రా... అన్నాడు... అంతే అతనిలో ఏదో తెలియని ప్రేరణ... ఏదో తెలియని ఆనందం.. కొంత భయం... కొంత కన్ఫ్యూజన్... నెమ్మదిగా భార్యకు చెప్పి...కార్లో శ్రీశైలం వెళితే ఆ స్వామి ఇతని కోసమే అన్నట్టు ఎదురు పడి... ఏ మంత్రం...తంత్రమో ఉపదేశం ఇవ్వలేదు.. కేవలం కర్తవ్యం గుర్తు చేశాడు అంతే..ఆ రోజు నుండి ఆ భార్యాభర్తలు ఉద్యోగం వదిలి...ఇద్దరూ సాధనలో ఉంటూ దేశం మొత్తం సంచారం చేస్తూ ఉన్నారు.. ఇద్దరు ఉద్యోగస్తులు..ఒక్కోరికి లక్ష పైనే జీతం వస్తుంది... ఇద్దరి యొక్క తల్లి తండ్రులు బాగా ఉన్న వారే.. హైదరాబాద్ సొంత సిటి! భార్యది వైజాగ్.. ఈ మధ్యనే పెళ్లి అయింది.. మొన్న డిసెంబర్ మొదటి వారంలో మా భద్రాచలం కి కాలి నడకన వచ్చారు... మా ఆలయానికి కూడా రావడం వలన ఈ సమాచారం తెలుసుకున్నా.. వారు తల్చుకుంటే వారు వారి తల్లిదండ్రులను అడిగితే ఎంత డబ్బు అయినా ఇస్తారు...కానీ వారి జీవితం చాలా సింపుల్... భిక్షాటన చేస్తూ దేశమంతటా తిరుగుతున్నారు... సాధన చేస్తూ ఉన్నారు .. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్న కారణంగా ఇద్దరూ కలిసి ఎక్కడికైనా వెళుతున్నారు..
ఇంకా ఉన్నారు.. ఉద్యోగం వదిలి.. వారణాసి లో నివాసం ఉంటూ అక్కడ సాధకులకు, సాధువులకు, మొదలైన వారికి రోజూ ప్రసాదం వండి పెడుతున్నారు... గంటల తరబడి ధ్యానం ...జపం... ఏదో జీవితం నడవడానికి పిల్లలకు ట్యూషన్లు చెప్పడం... ఎంతో సేవ చేస్తున్నారు వారు..
దీక్ష అనేది ఒకరు ఇచ్చేది కాదు ఇంకోరు తీసుకునేది కాదు.. అది అనుగ్రహం...
అలాగే ఆస్ట్రేలియా లో ఒక మహిళ ఉన్నారు... ఆవిడకు మన భారత దేశం అంటే తెలియదు... తన చిన్న తనంలో ఎవరో ఒక వ్యక్తి ప్రత్యక్షం అయి ఉపదేశం చేశాడు అంతే అప్పటి నుండి ఇప్పటి వరకూ ఒక ముద్ద కూడా ఆహరం తీసుకోలేదు...మంచి నీళ్ళు కూడా తాగరు... తన 14 వ ఏట నుంచే ఈ విధంగా... ఇప్పుడు ఆవిడకి 65 సంవత్సరాల పైనే ఉంటుంది...ఆవిడ ఇప్పుడు కూడా ఒక యంగ్ గర్ల్ లాగా ఉంటుంది.. ఆవిడకి కొంత మంది మహా యోగులతో డైరెక్టర్గా పరిచయం ఉంది!!! ఎంతో మందికి ఆవిడ శిక్షణ కూడా ఇస్తారు... ఆవిడ విధించే నియమాలు వింటే మనం ఆశ్చర్యపోతాం... వాళ్ళ శిష్యుల అనుభవాలు వింటే మనం చాలా గిల్టీ ఫీల్ అవుతాం ఎందుకు అంటే అవి అన్నీ మన సంస్కృతి సాంప్రదాయాలే.. మనకు తెలిసిన విద్యలే...మనం ఆచరించడం లేదు వాళ్ళు ఆచరణలో పెట్టడం, పరిశోధన, ప్రయోగం చేయడం, శాస్త్రీయ ప్రయోగాలు మొదలైనవి వారికి గొప్ప విజయాలు అందించాయి మన ప్రాచీన సాహిత్యం!!! అవే భగవద్గీత...యోగ దీపిక... యోగ వాశిష్టం.. మొదలైనవి.. మనం మాత్రం ఎవరైనా ఎదుగుతూ ఉంటే వాడి మీద ఎలా బురద జల్లాలి... వాడిని నాశనం ఎలా చేయాలి.. చెడు పేరు ఎలా తీసుకొని రావాలి ఇది మన చరిత్ర.. ఒక సామెత కూడా మన భారతీయులపై ఉంది.. మనకు ఉన్న రోగాల్లో గొప్పవి మన గురించి కాకుండా ఎంత సేపు ఎదుటి వారి గురించి ఆలోచన... డబ్బు డబ్బు డబ్బు... అధికారం... అధికారం... అందరూ నా మాట వినాలి... దాని కోసం నేను ఎవరి జీవితాన్ని అయినా నాశనం చేయడానికి సమస్త ఆయుధాలను ఉపయోగిస్తారు ఇది అత్యంత సహజమైన మానవ సైకాలజీ... దానికి కారణం భయం.. అంతరంగంలో అసంతృప్తి.. ఏదో తెలియని లోటు... నీకు నీ గురించి తెలిస్తే అందరిలోనూ నిన్ను నువ్వు చూస్తావు అంటారు రమణ మహర్షి.. నిన్ను నువ్వు తెలుసుకో అంటారు... ఆవిడ అదే సూత్రం ఫాలో అయింది...మరి మనం... పరతంత్రులం... నేను నాశనం అయినా పర్వాలేదు కానీ నా ప్రక్కన ఉన్నవారు మాత్రం బాగుపడటం ఇష్టం లేదు... మన మీద మనకు భయం ఉంటేనే ఎదుటి వారి పై దాడి చేస్తాం.. నిరంతరం రక్షణ కోసం ప్రాకులాట.. ఇంక ఇలా చెబుతూ పోతే చాలా అయితది కానీ
మన వాళ్ళు యుద్ద భూమి లో మన వీర జవాన్లు దేశానికి, సమాజం కోసం చిరు నవ్వుతో తమ కుటుంబాన్ని వదిలి ఆత్మ త్యాగం చేస్తారు .. మనం చూస్తున్నాం.. వారి యొక్క భౌతిక దేహం మీద మన జెండా ఉండటమే శతకోటి పురస్కారాలకు సమానం.. ఎన్ని ఇచ్చినా సరిపోదు వారి త్యాగానికి.. అలా ఎంతో... యోగులు... ఋషులు... గొప్ప గొప్ప సిద్ద పురుషులు ఇప్పుడు కూడా వారి యొక్క సంకల్పం శక్తి... అపారమైన ప్రేమ... ఈ యావత్ ప్రపంచానికి... సమస్త జీవులకు నిరంతరం పంచుతునే ఉన్నారు..
No comments:
Post a Comment