Sunday, February 5, 2023

శ్రీరమణీయం: మన బాహ్యజీవనం, అంతర్జీవనంలలోని ప్రభావాల ఫలితం ఏవిధంగా ఉంటుంది ?

 💖💖💖
       💖💖 *"460"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
     
*"మన బాహ్యజీవనం, అంతర్జీవనంలలోని ప్రభావాల ఫలితం ఏవిధంగా ఉంటుంది ?"*

*"మనం ప్రపంచంలోని విషయాలతో ఎలా ఉంటున్నామో, ఆ తర్వాత అదే మన మనసులో ఉంటుంది. ప్రపంచంలో ఉన్న అశాంతి, దుఃఖం అర్థమైన రోజు వాటితో ఎలా ఉండాలో తెలుసుకుంటాం. అప్పుడు మనం లౌకిక విషయాలను వదిలి పారిపోనక్కర్లేదు. మన మనసుకు వాటిపై నుండి తప్పించే నేర్పు అలవడుతుంది. సంసారంలో ఉంటూ కూడా మనం మనసులో దైవాన్ని అచంచల విశ్వాసంతో స్మరించ గలిగితే అది సన్యాస జీవితంతో సమానం అవుతుంది. మనకి ప్రస్తుతం లౌకిక విషయాలపై ఇష్టం ఎక్కువగా ఉంది. అవి ప్రపంచంలో ఉన్నాయి కనుక మన మనసు ప్రపంచంపైకి మళ్ళుతుంది. శాంతిగా ఉండేందుకు మనం ఎలా ఉండాలో తెలుసుకుని అలా ఉండగలగటంమే అంతర్జీవనం, ఆధ్యాత్మిక సాధన అవుతుంది. ఒక విషయం ఎదురుగా ఉన్నప్పుడు కోపం రావటం, ఎదురుగా లేనప్పుడు కోపం రాకపోవటం ఈ రెండూ వేర్వేరు కాదు. మనకి అశాంతినిచ్చే పది విషయాలను వదిలి, మనకు శాంతినిచ్చే ఒకే విషయాన్ని పట్టుకోవడమే ధ్యానం. మనం శ్రద్ధగా చేస్తే వృత్తి, ప్రవృత్తి రెండూ ధ్యానమే అవుతాయి !"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
           

No comments:

Post a Comment