Monday, February 20, 2023

🙏 శివపార్వతుల కళ్యాణానికి 🙏 వెళ్లిన .... ఓ ముసలి ముత్తయిదువ * పక్కన కూర్చున్న పేరంటాలితో { గుసగుసగా * ఓ మాట అంది }

 🙏 శివపార్వతుల కళ్యాణానికి 🙏
వెళ్లిన .... ఓ ముసలి ముత్తయిదువ *
      పక్కన కూర్చున్న పేరంటాలితో
            { గుసగుసగా * ఓ మాట అంది }

>>> ఇదేం విడ్డూరం అమ్మాయ్ః

పార్వతి ఎండకన్నెరుగని పిల్ల ........

పరమేశ్వరుడేమో > ఎండలో ఎండిపోతూ
> వానలో తడిసిపోతూ > శ్మశానాల్లో బతికే రకం !

ఆమె తనువంతా సుగంధ లేపనాలు *

అతడి శరీరమంతా బూడిద గీతలు *

ఆమె చేతులకు పంకీలు *

అతడి చేతులకు పాము పిల్లలు *
 
--- ఎక్కడా పొంతనే -- లేదు !
      
చూస్తూ ఉండూ *

నాలుగు రోజులైతే > పెళ్ళి పెటాకులవుతుంది <

నాలుగు రోజులు కాదు ........!

నాలుగు యుగాలు గడిచిపోయాయి .......!!

√ ఆదిప్రేమికులు √ ఆదిదంపతులుగా √
           \\ వర్ధిల్లుతూనే ఉన్నారు  //

బయటికి కనిపించే రూపాన్ని కాదు
శివుడి అంతః సౌందర్యాన్ని చూసింది పార్వతి *

అగ్ని ముఖంబు పరాపరాత్మకమాత్మ
కాలంబు గతి రత్నగర్భ పథము దర్శించుకుందా తల్లి. కాబట్టే ( ఆ ప్రేమ అజరామరమైంది )

అతడు విష్ణువు అయితే ^ ఆమె లక్ష్మీ ^
అతడు సూర్యడైతే ^ ఆమె నీడ ^
అతడు పదం అయితే ^ ఆమె అర్థం ^

అలా అని ఆ దంపతుల మధ్య
విభేదాలు రాలేదా అంటే > వచ్చాయి !

 ఆ కాపురంలో సమస్యలు
తలెత్తలేదా అంటే > తలెత్తాయి !

ప్రతి సమస్య తర్వాత.
ఆ బంధం మరింత బలపడింది *

ప్రతి సంక్షోభం ముగిశాక *
ఒకరికి ఒకరు బాగా అర్థమయ్యారు !

ఏ ఆలుమగలైనా పట్టువిడుల పాఠాల్ని
!! శివపార్వతుల నుంచే నేర్చుకోవాలి !!

ఒకసారి శివుడు
> మాట చెల్లించుకుంటే ...\
మరోసారి పార్వతి
> పంతం నెగ్గించుకుంటుంది *

మధురలో అమ్మవారిదే పెత్తనం \\

సందరేశ్వరుడు కేవలం మీనాక్షమ్మ మొగుడే *

నైవేద్యాలు కూడా
దొరసానమ్మకు నివేదించాకే దొరవారికి *

అదే చిదంబరం లో
నటరాజస్వామి మాటే శాసనం *
శివకామసుందరి > తలుపుచాటు ఇల్లాలు //

శంభోశంకర  హరహర మహాదేవ 🙏
💐🙏మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు🙏💐

No comments:

Post a Comment