🔥యుగధర్మము🔥
🌻🌻🌻🌻🌻🌻🌻🌻
కలియుగానికి అధిపతి కలి అన్నారు మరి కృతయుగ, త్రేతాయుగ , ద్వాపరయుగములకు ఎవరు అధిపతులు?
యుగధర్మము ఏమి చెపుతుంది? జ్యోతిష్యము ఏమి చెపుతుంది?
కలియుగమున అధర్మము పెరుగుటకు కారణము ఏమిటి?
యుగములు: 1. కృతయుగము 2.త్రేతాయుగము 3.ద్వాపరయుగము 4.కలియుగము
****
శిష్యుడు:-
కలికాలము అంటారు కలియుగము అంటారు కలి ఈ యుగమునకు అధిపతిఅయిన కృతయుగ, త్రేతాయుగ, ద్వాపరయుగములకు ఎవరు అధిపతి?
గురువు:-
వత్సా! ఇది యుగ ధర్మము. నవగ్రహములను ఈ కాలము నడుపుటకు నియమించినారు. యుగమునకు ఇద్దరి వంతున ఈ చతుర్యుగములను(4 యుగములను) పంచినారు. వారి వారి కారకత్వముల వారు ప్రసరించుచు పాలన చేస్తున్నారు.
ప్రస్తుత జ్యోతిష గ్రంథములలో కొన్ని గ్రహములను క్రూరులుగా పాపులుగా చెప్పినారు నిజముగా ఈ నవగ్రహములలో క్రూరులు లేరు పాపులు లేరు వీరు శుద్ధ పుణ్యులు. అయోని సంభూతులు గర్భమునందు జనించిన వారు కాదు. దేవతా స్వరూపములు. శుద్ధపున్యులు త్రిముర్తులయిన బ్రహ్మ- విష్ణు-మహేశ్వర అంశల జనించినారు. ధర్మ స్వరూపులు ధర్మ బద్దులు అధర్మము చేయనివారు.
వీరు నిజముగా పాప గ్రహములే అయితే దైవత్వమునకు ఎలా అర్హులు అవుతారు? నవగ్రహ మండలములో చోటు ఎలా లభిస్తుంది .
శుద్ధ పుణ్యులు దేవతలని, పాప పుణ్య మిశ్రితులు మానవులని, శుద్ధ పాపులు క్రిమి కీటకాది పశు పక్షాదులని ధర్మ శాస్తములు చెప్పుతున్నవి. ఉన్నదికుడా అదే.
ఉదా: ఒకడు బంగారము అమ్మి లాభము పొందుతాడు. మరొకడు ఇనుమును అమ్మి లాభము పొందుతాడు.
బంగారము అమ్మిన వాడిని గొప్పవాడని అంటావా? ఇనుమును అమ్మిన వాడిని హీనుడని అంటావా?
వస్తువు గోప్పదయినంత మాత్రాన మనిషి గొప్పవాడు అవుతాడా?
వస్తువు హీనమయినంత మాత్రాన మనిషి హీనుడవుతాడా?
వస్తువు హీనమయింత మాత్రాన మనిషి హీనుడు కాడు.
చంద్రునిలో అమృతము ఉన్నది రాహువులో హాలహలమున్నది. హాలాహలము ఉన్నంత మాత్రమున రాహువు పాపికాడు. గ్రహములకు ఇచ్చిన వస్తు సముదాయములో (కారకత్వములు)మంచివి చెడువి ఉన్నవి. కారకత్వముల వలన పాప గ్రహములు అన్నరుకాని నిజముగ నవగ్రహములలో ఎవరునూ పాపులు లేరు వీరు పూజ్యనీయులు దైవ సమానులు పూజించ తగినవారు.
యుగమునకు ఇద్దరి వంతున నియమించి పాలన చేయుచున్నారు అని చెప్పితిని కదా ఇక విను యుగధర్మము.
1.కృతయుగము
ఈ కృతయుగమునకు రాజుగా సూర్యుడు(రవి) మంత్రిగా గురువు(బృహస్పతి) నియమితులయ్యారు.
సూర్యుడు, గురువు విష్ణు అంశ వీరు మిత్రులు పరమ పవిత్రులు. సుక్షత్రియుడు, త్రిమూర్తి స్వరూపుడు, ధర్మ స్వరూపుడు, ధర్మ పరాయణుడు అయిన సూర్యుడు రాజుగా శాపానుగ్రహ శక్తి గల బ్రాహ్మణ స్వరూపుడు వేద వేదాంగ స్వరూపము ను తెలిసిన గురువు మంత్రిగా నియమితులు అయ్యారు.
బంగారమునకు అధిపతి గురువు కావున అప్పుడు ఎక్కడ చూసినా బంగారుమయముగా ఉండేది.
ప్రభువులకు ప్రజలకు ఎటువంటి భావ విభేదము విరోధము లేక చక్కగా కాలకు నడిచినది. సూర్య ప్రభావము చేత సుక్షత్రియులు, గురు ప్రభావము చేత సద్బ్రాహ్మనులు జనించి ధర్మ మయిన పాలన నడిచినది. సకాలమునకు వర్షము మంచి పంటలు పాడి పశువులు అభివుద్ది చెంది ప్రజలు సుఖమయిన జీవనము గడుపుతున్నారు . రాజు మాట మంత్రికి మంత్రి మాట రాజుకి చక్కగా నడిచి ధర్మమయిన పాలన జరిగినది.
కాలమును అనుసరించి బ్రాహ్మణులు మంత్రోపాసన చేత లోక రక్షణకు దేశ రక్షణకు మంత్రములతో యజ్ఞ యాగములు మొదలగు దైవ కార్యములు చేసి సుభిక్షమయిన కాలము నడుచునట్లు చేసేవారు. నాలుగు భాగముల ధర్మము నడచినది.
సూర్య, గురు వులు వారికి మిత్ర గ్రహములయైన కుజ, చంద్ర, కేతువుల సహాయముతో ధర్మమయిన పాలన చేస్తూ ఉన్నారు. శని, శుక్ర, బుధ, రాహు గ్రహములు కదలక మెదలక కొంత వరకు వాగ్వివాదము కల్పించ ప్రయత్నము చేసిరి. శని, శుక్ర, బుధ, రాహు గ్రహ కారకముల వలన కొంత అన్యాయ ప్రవర్తన కలిగి వివాదమునకు దిగు వానిని చూసి శాపానుగ్రః శక్తి గలిగిన బ్రాహ్మణులు కోపమాపలేక వీడు రాక్షసుడురా రాక్షసుడై పుట్టేందుకే ఇటువంటి అన్యాయ ప్రవర్తన ఇటువంటి మాటలు మాట్లాడు తున్నాడు అని అనడము వలన ఆ తపోశక్తి శాప రూపమున త్రేతాయుగములో రాక్షస వంశము అధికమయ్యెను.
సృష్టి మొదటినుండి రాక్షస వంశములున్నవని తెలియుచున్నవి. వాక్కు శక్తి వంతమయినది అందుకే కోపమును, వాక్కును ఆడుపులో ఉంచిన వాడు ఉన్నతస్తితికి వెళుతాడు. వాక్కులో అంతటి శక్తి ఉన్నది.
తపస్సుచే దైవబలమును సంపాదించారు కాని కోపము ఆపలేక పలికిన పలుకులు త్రేతాయుగములో క్రూరులు, రాక్షస స్వభావులు, రాక్షసులు, కలహము పెంచేవారు అధికమగుటకు కారణము.
ఈవిధముగా కృతయుగమున సవ్యముగా నడిచి త్రేతాయుగము ఆరంభమయినది.
2. త్రేతాయుగము.
ఇక త్రేతాయుగమునకు రాజుగా కుజుడు(మంగళుడు)మంత్రిగా శుక్రుడు మంత్రిగా నియమితులై పాలన నడుపుతున్నారు.
కుజుడు పురుష కారకుడు యువకుడు , యుద్ధప్రియుడు, సుక్షత్రియుడు, బాహు బాల పరాక్రమ వంతుడు, సత్యము పలుకు వాడు రాజుగా – వామాచారుడు (ఆచారమునకు కట్టుబడి ఉండక తిరుగువాడు) రాక్షస గురువు అయిన శుక్రాచార్యుడు స్త్రీలకు (యువతలకు)కారకుడు మాయ మంత్ర తంత్రవాది కుజునకు పరమ శత్రువు అయిన శుక్రుడు మంత్రిగా కాలము పాలించ వలసి వచ్చింది.
రాక్షస గురువు శుక్ర బలమున దుష్ట శక్తి, మాయా మంత్రం ప్రభావము చేత రాక్షసులను పురిగోలిపి యజ్ఞ యాగాది క్రతువులకు, తపస్సంపన్నులకు , రూపవతులయిన స్త్రీలకూ, బ్రాహ్మణులకు విపత్తులు కల్పించి భాదించు చుండెడివారు.
రాజు మాట మంత్రికి మంత్రి మాట రాజుకు పడకపోవడం చేత మంత్రులు క్రూర స్వభావులై రాజ్య పాలనను బ్రష్టు పట్టించి స్త్రీ వ్యామోహము వలన కలహము పెంచి ప్రజలను పిడించుచు రూపవతులు అగు స్త్రీలచే, యువకులకు పానహానిని గలిగించిరి.
నాలుగు హంగులలో ప్రథమ మయిన మంత్రము యజ్ఞ యాగాదులు మొదలగు దైవ కార్యములు వాటిని జరిపించు బ్రాహ్మన వంశాములను అంతరించునట్లు చేసెను.
దైవబలము తగ్గెను రాక్షసుల వలన, దుర్మార్గుల వలన మంత్రి సామంతుల వలన త్రేతాయుగములో నాలుగింట ఒక భాగము దెబ్బతిన్నది.
కుజ గ్రహ బలము చేత ధనుర్ విద్యా పారంగతులు (రామాయణము) అయిన రాజ యువకుల చేత రాక్షస సంహారము చేయించుచు, అధర్మపరులను శిక్షిస్తూ బ్రాహ్మణులను కాపాడుతూ స్త్రీలకూ రక్షణ కల్పిస్తూ ధర్మమును కొంత రక్షించు చుండిరి.
ఈ విధముగా త్రేతాయుగమున ధర్మము నాలిగింట ఒక పాదము తగ్గి ద్వాపరము అడుగిడినది.
3. ద్వాపరయుగము
ఇక ద్వాపర యుగమున రాజుగా చంద్రుడు , మంత్రిగా బుధుడు నియమితులయి పాలన్ చేస్తున్నారు.
చంద్రుడు గురు గ్రహ వర్గమునకు చెందినా వాడు బుధుడు శని వర్గమునకు చెందిన వాడు. ఒకరికి ఒకరు పడనివారు. బుధుడు చెడు విద్యలను రాక్షసులకు, దుర్మార్గులకు, దుష్టులకు ఇచ్చి సాదువుల సజ్జనుల, రూపవతుల, పతివ్రతలకు, కన్యలకు అపకారము చేయు వారిని పురిగోల్పెను.
బుధుడు మాంత్రికుడు, మోసములకు నెలవు, వ్యవహార్ములకు అధిపతి ద్వాపరమున అనేక బాధలు కలిపించెను. దేవతా కార్యములు అర్థ భాగము నశింపు చేసెను. రాజులకు బ్రాహ్మణులకు భావ విభేదము కల్పించి బ్రాహ్మణులను సేవకులుగా కొంత వరకు మార్చెను.
నాలుగు హంగుల ధర్మములో రెండు హంగులు మాత్రమె నిలిచినది.
చంద్రుడు సకల విద్యా పారంగతుడు బలవంతుడు మనో కారకుడు మాతృ కారకుడు కాన రాజుల విధ్యాపారంగుతులను చేసి ధనుర్ విద్య నేర్పించి దుష్టులను ప్రబలకుండా ఈ మాంత్రికులను, వామాచారులను, మాయావులను నాశనము చేయుటకు స్వయముగా భగవానుడే కృష్ణుడిగా అవతరించి దేవతా వర్గమున కొందరిని (ఇంద్రుని అంశలు – ధర్మ రాజు, భీముడు, అర్జునుడు, నకుల, సహదేవులు) తోడుచేసుకొని ద్వాపరయుగ అంతమున మంత్రయుగమును మటు మాయము చేసెను.
ఈ విధముగా ద్వాపర యుగమున ధర్మము రెండు భాగాలు నశించి కలియుగము ప్రారంభము అయినది. మంత్రం యుగము అంతరించి యంత్రయుగము ప్రారంభము అయినది.
4. కలియుగము
ప్రస్తుతము మనమున్నది కలియుగమున.
ఈ కలియుగమునకు రాజు శని మంత్రులు రాహు కేతువులు.
రాహువు కేతువు ఒకరికి ఒకరు పడని వారు రాహువు శనికి మిత్రుడు. కొంత కాలము రాహువు మంత్రిగా కొంత కాలము కేతువు మంత్రిగా పాలన చేయుచున్నారు.
ఎప్పుదయితే నాలుగు ధర్మ శాస్త్రములు మాయమయినవో అప్పుడు కలియుగము ముందుకు నడిచేను.
ధర్మమును నిలబెట్టు శాస్త్రములు ఉన్న తన పని సాగదని కలియుగము నడవదని తలంచి కలియుగ ఆరంభములోనే శాస్త్రములను వారిని రక్షించు బ్రాహ్మణులను, అగ్రహారములను, రాజులను ఒక్కొక్కటిగా నశింపు చేస్తూ వచ్చెను.
అప్పటినుండి కూరము, కుచ్చితము, అసత్యము, అప్రమాణము, అధర్మము, అన్యాయము తలెత్తెను.
వావి వరుసలు తప్పెను, వర్ణ సంకరములు మొదలయ్యెను, దొరలే దొంగలయిరి. దైవభక్తి తగ్గెను, గురుభక్తి, మాతృపితృ భక్తి అపురూపము అయ్యెను. దైవమును నమ్మి పూజించు కాలము పోయి గురువును పూజించు కాలము వచ్చెను. హింసా సిద్ధాంతము ఎక్కువ అయ్యింది, పాపము వలన దుఖము అనుభవిస్తాము అన్న భయమే లేకుండా పోయింది. పుణ్య కార్యములు కరువయ్యాయి. ఏవిధముగా నయినా ధనము(సిరి) స్త్రీని పొందినవాడే గొప్పవాడని చెప్పువారు చేయువారు ఎక్కువయ్యేను. బందు ప్రీతి దురంయ్యేను. సంసారం సుఖము శూన్యమయ్యే కాలము వచ్చెను. దొంగలకు దారి చూపే ప్రజలు, ప్రభువులు పెరిగారు. ప్రజలు స్వధర్మమును వీడి అన్య ధర్మములను ఆచరించు కాలమునాకు పోయెను. వర్ణ ద్వేషములు మత ద్వేషములు పెరిగెను. మంచివారు , ధర్మపరులు, సత్యవంతులు దుర్మార్గులచే పీడించపడిరి.
కేతువు మంత్రిగా ఉన్న కాలములో కొంత మంది ధర్మ పరాయణులు పుట్టి లోకమునకు మంచి మార్గమును చూపెట్టు కార్యములు చేస్తున్నారు.
ఈవిధముగా చెప్పుటకు వీలు కాని విధముగా కాలము ఈ కలియుగమున నడుస్తున్నది. ఇంకా కలియుగము నడువ వలసి ఉన్నది...
.🌹సర్వేజనాసుఖినోభవంతు 🌹
No comments:
Post a Comment