💖💖💖
💖💖 *"454"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
*"సన్యాసం అంటే ఏమిటి ? మార్గదర్శకులు ఎలా అవుతారు !?"*
*"సన్యాసం అంటే ఏవిధమైన వస్తువులతో పని లేకుండా బ్రతకడం కాదు. ఆ వస్తువులను కావాలనుకోకుండా జీవించడమే సన్యాసం. కంచి మహాస్వామి వారి దర్శనం కోసం ఒక కోటీశ్వరుడు వచ్చారు. ఆ స్వామి అప్పుడు ముఖ్యమైన ఒక చర్చలో ఉన్నారు. విరాళంగా ఇచ్చేందుకు వచ్చిన ఆ ధనికుడిని ఉద్దేశించి స్వామి 'నాతో పని ఉంటే ఉండమనండి' అన్నారే కానీ మర్యాదలతో మెప్పించే ప్రయత్నం చేయలేదు. సన్యాసం అంటే తన శరీరంతో సహా భౌతిక అంశాలకు మనసులో ప్రాధాన్యత లేకుండా చేసుకోవటం. అంతమంది భార్యలు ఉన్నా శ్రీకృష్ణుడు నిర్లిప్తంగా ఉన్నాడు కనుకనే అస్కలిత బ్రహ్మచారిగా నిలిచిపోయారు. ప్రపంచంలో అలా నిర్లిప్తంగా సంచరించే వ్యక్తులే ఆధ్యాత్మిక జీవితంలో మనకు మార్గదర్శకులు అవుతారు. మార్గదర్శకులుగా నిలిచే వారినే మనం గురువుగా పూజిస్తాం. మంచి వాళ్ళను మాత్రమే తన వద్ద చేర్చుకోవడం గురువు లక్షణం కాదు. తన వద్దకు వచ్చిన వారందరికీ ధర్మాన్ని బోధించి మంచి దిశగా పంపడమే గురువు కర్తవ్యం !"*
*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
No comments:
Post a Comment