*చదువు - సంస్కారం*
📖📖
ప్రాచీనకాలంలో రాజులు తమ పిల్లలను వి ద్యాభ్యాసం కోసం, ఇతర రాజ్యాలలోని వి ద్యాపీఠాలకు పంపేవారు. తమ రాజ్యంలో ప్ర సిద్ధమైన విద్యాపీఠాలుండేవి. కాని లోకజ్ఞానం కోసం తమ పిల్లలను ఇతర విద్యా పీఠాలకు పంపేవారు.
కాశీరాజు తన కుమారుని విద్యల కేంద్రమైన తక్షశిలకు పంపాడు. వేయి బంగారు నాణెము లిచ్చి 'బాబూ! ఈ పైకమును గురుదక్షిణగా చె ల్లించి విద్యనార్జించి రా' అని ఆశీర్వదించి పం పాడు.
రాజకుమారుడు తక్షశిల చేరాడు. ప్రధానాచా ర్యులను కలుసుకొని సాష్టాంగ నమస్కారం చే సాడు.
"నీ వెవరు? ఎక్కడి నుండి వచ్చావు?" అని అ డిగాడు ఆచార్యులు.
"నేను కాశీరాజు కుమారుణ్ణి. తమ వద్ద చదు వుకోవాలని వచ్చాను" అన్నాడు రాజకుమా రుడు. తాను తెచ్చిన బంగారు నాణేలను వా రికి అందజేసాడు. విద్యాభ్యాసం ప్రారంభమైం ది. ఆచార్యులు రాజకుమారుని వాత్సల్యంగా చూస్తూ ఉండేవారు. రాజకుమారుడు సుఖం గా ఉన్నాడు.
వేసవికాలం. ఒక మధ్యాహ్నం తీవ్రమైన ఎం డ. గరువుగారితో పాటు రాజకుమారుడు మ ధ్యాహ్న సంధ్యావందనం కోసం నదికి వెళుతు న్నాడు. దారిలో ఒక పూరి గుడిసె. గుడిసెలో ని ముసలామె పచ్చి బెల్లం ముద్దలను ఎండ లో ఆరబెట్టింది. రాజకుమారునికి వాటిని తి నాలనిపించింది. చుట్టూ చూసాడు. ఎవరూ కానరాలేదు. చిన్న బెల్లం ముద్దను నోటిలో వే సుకొన్నాడు. గుడిసెలో కూర్చున్న ముసలామె గమనించింది. 'పాపం దప్పిగొన్నాడేమో' అను కొన్నది. మరుసటి రోజు కూడా రాజకుమారు డు బెల్లం ముక్క తిన్నాడు.
ఇలా వారం రోజులు గడిచాయి. రాజకుమా రుడు రోజూ బెల్లం ముద్దలను దొంగచాటున తింటున్నాడు. ముసలమ్మ సహనం హద్దు మీ రింది. పదవరోజు రాజకుమారుని చేయి పట్టు కుంది. బుద్ధిలేదూ? దొంగతనం చేస్తావా?' అం టూ గట్టిగా కేకలు వేసింది. ముందుగా వెళ్తున్న ఆచార్యుడు ఆగి 'నిజమేనా?' అని ప్రశ్నించా డు. రాజకుమారుడు సహజమైన అహంకా రంతో 'ఔను' తిన్నాను అన్నాడు.
గురువు కోపంతో రాజకుమారుని వీపు పై రెం డు దెబ్బలు కొట్టారు. 'ఇక మీదట ఇట్టిపని చే యకు జాగ్రత్త' అన్నాడు. రాజకుమారుడు ఆ చార్యుని కోపంతో చూచాడు.
'నేను రాజైనపుడు ఈ గురువుగారికి తగిన శా స్తి చేస్తాను' అని మనసులో అనుకొన్నాడు. రాజకుమారుని కోపాన్ని గురువు గ్రహించాడు. నాటి నుండి వేరే దారిలో నదికి వెళ్తుండేవారు.
రాజకుమారుని విద్యాభ్యాసకాలం ముగిసిం ది. తిరిగి తన రాజధానికి వెళ్ళాడు. కాశీరాజు కుమారునికి రాజ్యాధికారం అప్పగించాడు. రాజకుమారుడు తన ఆచార్యులకొక జాబు వ్రాస్తూ..
'తమ శిష్యుడు ప్రస్తుతం చక్రవర్తి అయ్యాడు. తాము వచ్చి ఆశీర్వదించాలి' అని కోరాడు. ఆ చార్యుడు రాజకుమారుని అహంకార స్వభా వం ఎరిగిన వాడు కనుక వెళ్ళలేదు.
కాలక్రమంలో రాజు పేరు ప్రతిష్ఠలను ఆర్జించా డు. కొన్నేళ్ళు గడిచాయి. గురువు వృద్ధుల య్యారు. దేశ సంచారం చేస్తూ కాశీరాజ్యం చే రారు.
తన పూర్వ శిష్యుడైన చక్రవర్తిని ఆశీర్వదించా లని ఆస్థానానికి వెళ్ళాడు. చక్రవర్తి సంతోషిం చాడు కాని, లోగడ తాను ఆచార్యుని చేత తి న్న దెబ్బలను మరవలేదు. గర్వంతో 'రాజకు మారుడని తెలిసి కూడా, మీరు నన్ను తీవ్రం గా దండించారు. ఇప్పుడు రాజ్యాధికారం నా చేత ఉంది. మిమ్ములను నేను దండించవ చ్చు కదా?' అని అడిగాడు దర్పంతో.
గురువు చిరునవ్వు నవ్వాడు.
'మహారాజా, ఇపుడు నువ్వు పాలకుడివి. ని జమే. నీవు నన్ను దండించే అధికారం కలవా డివి. కాని ఒక మారు బాగా ఆలోచించు. నీ త ప్పులను దండించకుండా ఉండివుంటే నీవు ఈనాడు ఈ దశలో ఉండేవాడివి కాదు. దొంగ అయ్యేవాడివి, దారిదోపిడికాడయ్యే వాడివి. ప్రజాకంటకుడయ్యేవాడివి. నీవు రాజ్యాధికా రానికి తగినవాడివి కావాలనే ఆశయంతో మీ తండ్రిగారు నిన్ను నా వద్దకు పంపారు. నీవి ప్పుడు గొప్ప రాజు కావటానికి, నా శిక్షణయే కారణం. ఆ విషయం గుర్తించుకో. నా శ్రమ సా ర్థకమైందని భావిస్తున్నాను' అన్నాడు.
రాజు తన జీవిత సంఘటనలను నెమరు వే సుకొన్నాడు. తన చిలిపి చేష్టలను, దౌష్ట్యాల ను గమనించి సకాలంలో సరిదిద్దిన తన గురు వుగారి ప్రేమానురాగాలను గుర్తు చేసుకోసా గాడు. గురువు తన ఎదుట మందస్మిత వద నంతో నిల్చున్నాడు. రాజు హృదయం కృత జ్ఞతతో నిండిపోయింది. భక్తి ప్రపత్తులతో కన్నీ రు కారుస్తూ, సింహాసనం నుండి దిగాడు. గు రువుగారికి సాష్టాంగ నమస్కారం చేసాడు. త న ఉన్నతాసనం మీద కూర్చోపెట్టాడు. సకల రాజ మర్యాదలతో సత్కరించాడు. గురువు గారి తీర్థయాత్రలు సుఖంగా సాగించుటకు అ న్ని ఏర్పాట్లు చేశాడు.
🙏🙏
No comments:
Post a Comment