🙏🕉🙏 ...... *"శ్రీ"*
🔥 *"19"* 🔥
🔥🔥 *"ఆత్మ జ్ఞానం"* 🔥🔥
🔥🔥 *"మోక్షమార్గం"* 🔥🔥
💖🔥💖🔥💖🔥💖
💖🔥🕉🔥💖
💖🔥💖
💖
*"ఆత్మ జ్ఞానం ౹ మోక్ష మార్గం ౹ సృష్టి రహస్యం ౹ ఏడు జన్మలు ఏమిటి ? ౹ నేను అంటే ఎవరు ? ౹ దుఃఖం ఎలా తొలగుతుంది ? ౹ జ్ఞాన విచారణ ౹ మానవుడు జిజ్ఞాసతో అన్వేషిస్తున్న ఎన్నో సందేహాలకు సమాధానాలు ౹"*
*"మరణంతో కేవలం ఈ శరీరం మాత్రమే నశిస్తుందిగాని అందులోని జీవుడు నశించడు అని జ్ఞానులు చెబుతున్నారు."*
*"ఎందుకంటే మానవుడు అంటే అనుభవాలను అనుభవించేవాడేగాని ఈ జడ శరీరం మానవుడు కాదు."*
*"ఇక రూపం లేని అనుభవాలకు రూపం కలిగిన ఈ శరీరం ఎన్నటికీ కారణం కాజాలదు."*
*"అనుభవాలన్నింటినీ అనుభవించేవాడే ఆ అనుభవాలకు కారణం కూడా."*
*"కాబట్టి అనుభవాలకు రూపం లేనందున వాటిని అనుభవించేవాడికి కూడా రూపం లేనట్లే గదా."*
*"ఇక రూపం లేనివాడు మరణించడం అనేది ఎక్కడుంటుంది."*
*"శరీరం అనే రూపం మాత్రమే మరణిస్తుంది."*
*"శరీరంలో ఉన్న రూపం లేనివాడు ఎన్నటికీ మరణించడు."*
*"చెట్టు, ఆకాశం ఒకదానితో ఒకటి కలిసిపోయి ఉంటాయి."*
*"అంతమాత్రాన చెట్టు నశిస్తే ఆకాశం నశిస్తుందా?"*
*"అదేవిదంగా శరీరం, మానవుడు ఒకటే అయినట్లుగా కనిపించొచ్చు."*
*"కానీ రెండూ ఒకటి కాదు."*
*"శరీరం నశిస్తే మానవుడు నశించడు. మానవుడు తాను ధరించిన ఈ శరీరం శిధిలం కాగానే మరొక శరీరంలోకి ప్రవేశిస్తాడు."*
*"మరణం అనగానే ఈ లోకంలోని మానవుడి యొక్క భయం అంతా మరణం తర్వాత రాబోవు ఆ నూతన శరీరం ఏదనేది అతడికి ఇప్పటికి తెలియకపోవడంవల్లే."*
*"మనసు కోరుకున్నవన్నీ మనసుకి అందించి మనసును ఆనందింపజేయడం వల్ల మనసులో కామం, క్రోదం, లోభం, మోహం, మదం, మాత్సర్యం లాంటి చెడ్డ గుణాలన్నీ ఎన్నోరెట్లు పెరిగిపోతాయి."*
*"మనిషి ఈ శరీరం ఒకరోజు కోల్పోయాక తన మనసులో ఉన్న సంస్కారాల అల్ప అధిక స్థాయిలను బట్టి ఆ అధిక సంస్కారాలకు అనుగుణమయిన దేహంలోకి తిరిగి ప్రవేశించాల్సి ఉంటుంది."*
*"అందుకనే ఈ లోకంలో జనులు సుఖాలు అనుభవించగలిగే స్తోమత కలిగి ఉన్నా అలా లేకున్నా మనసులో కామ, క్రోధాదులను అధికం చేసే ఈ భౌతికమయిన సుఖాలలోకి మనసును ప్రవేశింపజెయ్యకుండా మనసును ధ్యాన స్థితిలో నిరంతరం నిలిపి ఉంచుకోమని జ్ఞానులు తెలియజేస్తున్నారు."*
*"అప్పుడు మానవునికి తిరిగి మరొకసారి మానవ దేహమయినా లభించొచ్చు లేదా మోక్షం అయినా సిద్ధించొచ్చు."*
*"అలాకాకుండా మనసును జీవించినంతకాలం సుఖాలలో గనక తిప్పితే పై రెండూ కూడా లభించవని జ్ఞానులు మనకు తెలియజేస్తున్నారు."*
*"ఒకటి గమనించండి."*
*"కోరికలు అనేవి మానవుని మనసులో అజ్ఞానం వల్ల కలుగుతున్నాయి."*
*"కానీ మానవుని ఆనందానికి అతడి మనసులో కలిగే కోరికలకు ఎలాంటి సంబందమే లేదు."*
*"కోరికలవల్లో లేక కోరుకున్నవి లభించడంవల్లో ఆనందం కలుగడం అనేది కేవలం భ్రమ మాత్రమే."*
*"ఎందుకంటే ఆనందం అనేది ఆనందించేవానిలోనే ఉందిగాని బయట లేదు."*
*"ఈ లోకంలో ఎక్కడయినా ఆనందం అనేది బయట దొరుకుతుందా?"*
*"దొరకనే దొరకదు."*
*"ఎందుకంటే ఆనందం అనేది ఒక వస్తువో మిఠాయో కాదు బయటనుంచి తెచ్చుకోవడానికి."*
*"మానవుని బుద్ధిలోనే ఆనందం అనేది నిండి ఉంది."*
*"మానవుని స్వరూపమే “ఆనందం”."*
*"ఆ ఆనందాన్ని మీరు పొందటానికి బయటి వస్తువులు పొందాల్సిన అవసరమే మీకు లేదు."*
*"ఆనందానికి మరొక పేరే మీలోని “ఆత్మ”."*
*"మీ పేరు ఏ ఎల్లయ్యో పుల్లమ్మో అనుకోకండి."*
*"మీ పేరే “ఆనందం”."*
*"అనంతమయిన ఆనందంతో నిండి ఉన్న మీరు ఆనందమనే మిమ్మల్ని వదిలేసి మనస్సనే మరో దానితో ఆనందం కొరకు బయటకు చూస్తూ ఏదయినా లభిస్తే మాకు ఆనందం అనుకుంటూ వాటికొరకు వీటికొరకు వెతుకుతున్నారు."*
*"ఇక్కడ ఇంకా చిత్రం ఏంటంటే ఆనందానికి మారు పేరయిన “ఆత్మ” అనే మీలోనుంచి ఏర్పడి మీకంటే వేరుకాని ఈ మనస్సు అసలు మీరు లేనట్లుగా అంతా తానే అయినట్లుగా ఈ లోకాలలోకి శరీరాలతో ప్రవేశించి నాకు ఆనందం కొరకు అది కావాలి ఇది కావాలి అనుకుంటూ తిరుగాడుతోంది."*
*"సేవకుడి చేత సేవ చేయించుకోవాల్సిన యజమాని సేవకుడికే సేవ చెయ్యడం ఎలాంటిదో మీ పరిస్థితి ఇక్కడ అలాంటిది."*
*"ఆత్మ కించిత్ ఆదమరచడం వల్ల ఈ మనస్సు అనేది అంతా తానే అయి సుఖ దుఃఖాలు అనే అనుభవాలను ఆత్మ స్వరూపుడయిన మానవునికి కలుగజేస్తోంది."*
*"అలా ఈ మనస్సు అనే దాని వెంబటి లోకాల చుట్టూ కల్పిత శరీరాలతో తిరిగి తిరిగి అలసిపోయిన ఆత్మ అనే మీరు ఒకానొక రోజు మేలుకుని నేనేంటి ఎక్కడెక్కడో తిరుగుతున్నాను."*
*"ఏవేవో సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాను."*
*"ఆనందమే నేను కదా!"*
*"మరి నాకు ఈ దుఃఖం ఏంటి?"*
*"అసలు ఈ దుఃఖం అనే దరిద్రమంతా నాకు ఎక్కడినుంచి వచ్చింది అని గుర్తెరుగుతున్నారు."*
*"మీరు అలా గుర్తెరిగిన మరుక్షణం మీలోనుంచి దుఃఖానికి మారుపేరయిన ఈ మనస్సనేది మాయమైపోతోంది."*
💖🔥💖🔥💖
💖🕉️💖
No comments:
Post a Comment