[3/26, 20:59] +91 73963 92086: 🌹 శ్రీ రమణీయం - 5 🌹
👌బ్రహ్మపదార్థంగా చూస్తే భేదమే లేదు 👌
✍️ శ్రీ గెంటేల వెంకటరమణ
నమో వేంకట రమణాయ,
అద్వైత నిధయే నమః
✳️🌹🌹🌹🌹✳️🕉️✳️🌻🌻🌻🌻✳️
🌈 5. బ్రహ్మపదార్థంగా చూస్తే భేదమే లేదు 🌈
✳️ విడదీయలేని ప్రకృతి చైతన్యాల కలయికే ఈ సృష్టి. మన మనసుకు ప్రాథమికంగా బాహ్యవిషయాలను మాత్రమే గమనించగల శక్తి ఉంది. అందువల్ల ప్రకృతిలో కనిపించే విభిన్నతనే అది చూడగలుగుతుంది. సూక్ష్మ పరిశీలనతో గమనిస్తేనే గానీ ప్రకృతి అంతటా అంతర్లీనంగా, సమానంగా వ్యాపించి ఉన్న చైతన్యాన్ని మన మనసు చూడగలుగుతుంది. కోట్ల కొద్దీ చెట్లు వేరువేరుగా ఉన్నా వాటికి ఆధారమైన నేల సమంగా ఎలా ఉందో ఈ సృష్టిలో కనిపించే ప్రతి విషయం వెనుక కనిపించని చైతన్యం దాగిఉంది. అది అభిన్నంగా ఉంది. దానిని గమనించటానికి మన మనసుకు సాధన కావాలి.
✳️ మనం ప్రతిప్రాణి చేసే పనులను, వాటి కదలికలను మాత్రమే చూస్తున్నాం. అందుకు ఆధారమైన కారణాలను చూడటం లేదు. ఇది మన నుండే మొదలౌతుంది. ఆత్మ స్థానమైన హృదయం నుండి వెలువడే మనసు ప్రపంచ విషయాలలోకి విస్తరిస్తుంది. అందువల్లే ఈ విక్షేపం జరుగుతుంది. ఈ భేదదృష్టి పోయి మనసుకి విభిన్నత గోచరించనినాడు మనం ఆత్మ స్థితిలోనే ఉంటాం. ప్రతిరోజు గాఢ నిద్రలో అదే జరుగుతుంది. అందుకే అందరం అక్కడ సమానంగా ఉంటున్నాం. జాగృతిలో, స్వప్నాలలో అనేక తేడాలు ఉండవచ్చు. కాని గాఢనిద్రలో ఉన్న స్థితిలో ఎవరికీ ఏ తేడా ఉండదు. ఆ స్థితిని మనం మెళుకువలో కూడా సంపాదించుకోవాలంటే ఈ సృష్టి యెడల సమదృష్టి రావాలి. అంటే అంతటా సమంగా నిండి ఉన్న సత్యాన్ని, ఆధారాన్ని మనం చూడ గలగాలి. ఫ్యాన్ తిరగాలంటే అందుకు కరెంటు ఉన్నదన్న స్పష్టత మనకు ఎలా ఉంటుందో, ప్రతి ప్రాణిలోనూ ఉన్న బ్రహ్మపదార్థం చూడాలి. బ్రహ్మ పదార్థానికి అవి లేవని, అవన్నీ ప్రకృతి సత్యం అని కూడా అంత స్పష్టంగా మనకు తెలియబడాలి. ఈ పరిశీలన మన దేహంనుండే ప్రారంభం కావాలి.
✳️ ఇతరులు చేసే పనులను మనం ఎలా పరిగణిస్తామో మన పనులను కూడా అలా పరికించగలగాలి. అంటే మన దేహ కార్యాలన్నింటికి సాక్షిగా ఉండాలి. ముందు దేహకర్మలను సాక్షిగా వీక్షించే మనసును సాధించాలి. ఆ తర్వాత మనసును నెమ్మదిగా ఆలోచనలకు సాక్షిగా మరల్చాలి. సాక్షిగా అంటే పరిశీలకుడిగా అని కాదు. కేవలం నిమిత్త మాత్రంగా ఉంటూ తెలియబడేవాటిని గమనిస్తూ ఉండాలి. ఇలా మన కదలికలలోనూ, ఎదుటి వారి కదలికలలోనూ బ్రహ్మ పదార్ధాన్నే చూడగలిగితే భ్రమలు తొలుగుతాయి. అందుకు దృఢవిశ్వాసం కావాలి. మనం ఏనాడు చూడని దయ్యాన్ని ఊహించుకొని చీకట్లో ఎలా భయపడతామో అంత గట్టి నమ్మకం మనలో ఉన్న ఆత్మ వస్తువుపై రావాలి. మన పంచేంద్రియాలకు గోచరం గాని శక్తి ఈ సృష్టిని నడుపుతుందన్న విశ్వాసంతో చేసే విచార సాధన త్వరగా సిద్ధిస్తుంది. మంచి రుచికరమైన భోజనం తినాలంటే పాత్రల శుద్ధి, పాకశుద్ధి ఎలా అవసరమో మనలో ఉన్న దివ్యత్వాన్ని సాధించాలంటే మనోదేహాల పవిత్రత అంత అవసరం.
✳️ పవిత్రతను సంతరించుకున్న మనసు బ్రహ్మపదార్థాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటుంది. విభిన్నత కనిపించని మనసు “అంతస్సారమైన ఆత్మగా” నిలిచి ఉంటుంది. ఈ సృష్టిలో క్రియలన్నీ కేవలం చైతన్యశక్తి యొక్క కదలికలుగా తీసుకుంటే విచారసాధన సులువు అవుతుంది. చేప మొప్పలతోనూ, కప్ప చర్మం ద్వారానూ, మనిషి ముక్కుద్వారానూ గాలిపీల్చడం ప్రాణ వాయువు కోసమని గుర్తిస్తే ఈ బాహ్యకర్మల భేదం మనని బాధించకుండా ఉంటుంది. అందుకే 'జిల్లెళ్ళమూడి అమ్మవారు' *'తిట్లన్నీ అక్షరాలేగా నాన్న'* అన్నారు.
🌈 అంతటా సమంగా ఉన్న బ్రహ్మపదార్థం ఇన్నీ ఆకారాలుగా, గుణాలుగా ఎందుకు వ్యక్తం అవుతుందంటే అది ప్రకృతి లక్షణం. ఒకే భూమిలో, ఒకే నీటితో మొలిచే మొక్కలు ప్రకృతి ధర్మాన్ని బట్టి భిన్నభిన్న జాతులుగా ఉన్నట్లే ఇవి కూడా. మొక్కలను విడదీయగలంగానీ, అందులో ఉండే ప్రాణాన్ని విడదీయలేం. అందుకే బ్రహ్మపదార్థమే మొక్కగా, మనిషిగా, జంతువుగా, నీటిగా, నిప్పుగా ఉందని తెలుసుకోవాలి. అప్పుడు మన శరీర కదలికలన్నీ బ్రహ్మ పదార్థం ఉండటం వల్లనే అని తెలుస్తుంది.
🌈 ఈ విధంగా విశ్లేషిస్తూపోతే ప్రతి వస్తువు ఉనికికి, పనికి వాటిలో మార్పులకు, జనన మరణాలకు బ్రహ్మపదార్థమే కారణమని తెలుస్తుంది. మనకి ప్రస్తుతం ఈ బ్రహ్మీభావన లేని కారణంగానే మనం ప్రపంచం నుండి వేరు అనుకునే దేహాత్మభావనలో ఉంటున్నాం. 'నేనుదేహం’ అని కాకుండా 'ఈ దేహం నాది' అనే భావన రావాలి. మన ఉనికికి ఒక ప్రత్యేకత కోరుకోవటం చేతనే మనసు సమత్వాన్ని పొందలేకపోతుంది. మనందరం ఒకే బ్రహ్మపదార్థం తాలూకు విభిన్న పరికరాలమే తప్ప మూలంలో తేడా లేదని అర్థం అయితే 'స్వీట్' పేరు, రుచి ఏదైనా అన్నింటిలో ఉన్నది తియ్యదనమే కదా అన్నంత స్పష్టత వస్తుంది.
🌈 అసలు మనసుకి ఈ భేదభావాలు, విక్షేపాలు ఎందుకంటే అది హృదయం నుండి వెలివడినందువల్లనే. మనసు వచ్చిన త్రోవలోనే వెనక్కి వెళితే తిరిగి నిశ్చల స్థితితో ఆత్మగా స్వస్థితి పొందుతుంది. కారణాలు ఏవైనా మనం అనుభవించే బాధగానీ, సంతోషంగానీ అవే ఉంటాయి. ఆకలి, కదలిక, బాధ, సంతోషం వంటి లక్షణాలు అన్ని జీవులకు సమానమే.
[3/26, 21:00] +91 73963 92086: స్థితులు సమానంగా ఉన్నా పరిస్థితుల్లో తేడాలు మనని నిత్యం దూరం చేస్తున్నాయి. మనం ఆ స్థితిలో ఉండగలిగితే, తానే ఆ బ్రహ్మపదార్థం అని తెలుకోగలిగితే ప్రత్యేకించి ప్రార్థించేందుకు ఏమి ఉండదు. కేవలం భక్తి, శరణాగతే మిగులుతాయి.
🌈 నిరంతరం నవ్యత కోసం ప్రాకులాడే మనసు సుఖసంతోషాలు ఎక్కడో ఉన్నాయని వెదికి వెదికి చివరకు అవితన మూలంలోనే ఉన్నాయని తెలుసుకుంటుంది. ఉన్నది ఉన్నట్లుగా ఉండటం సుఖం కాదనుకొని పరుగులు పెట్టినా... ప్రతిసుఖం వెనుక, సంతోషం వెనుక ఉన్నది ఆనిశ్చలతే అని ఒకనాటికి తెలుస్తుంది. ఆత్మ సంబంధంలేని సంతోషమే లేదు. మనకు తెలిసినా తెలియకపోయినా మనకి సంతోషం కలిగిందంటే మన మనసు తన మూలమైన ఆత్మతో కలిసిందనే అర్థం. అదే ఆత్మానుభవమని శ్రీరమణభగవాన్ అంటున్నారు. అది తెలియక సంతోషం బయట నుండి వస్తుందని మనసు భ్రమిస్తుంది. “కుక్క ఎండిపోయిన ఎముకముక్కను కొరుకుతున్నప్పుడు తన పళ్లనుండి వచ్చే రక్తాన్నే చీకుతూ అది ఆ ఎముక నుండి వస్తుందని భ్రమిస్తుంది" అని భగవాన్ ఈ విషయాన్ని సోదాహరణంగా వివరించారు. మనం సాధనకి, శాంతికి అడ్డం అనుకొనే కామ క్రోధాలు ఎవరిని ఆవరించి ఉన్నాయో లక్షణాలని మనకి తెలుస్తుంది. మల్లె, గులాబీల గుణాలు ప్రకృతివే గానీ మీవి కావుకదా.
🙏ఓం నమోభగవతే శ్రీరమణాయ🙏
సేకరణ:
✳️🌹🌹🌹🌹✳️🕉️✳️🌻🌻🌻🌻✳️
No comments:
Post a Comment