🙏🕉🙏 ..... *"శ్రీ"*
🔥 *"ఏది శాశ్వత ఆనందం"* 🔥
🔥🕉️🔥🕉️🔥🕉️🔥
🔥🕉️🔯🕉️🔥
🔥🕉️🔥
🔥
*"తల్లితండ్రులు, భార్యా బిడ్డలు ,స్నేహితులు, ఏ బంధం గురించి అయినా ఎదో ఒక రోజు అందరికీ సహజంగా అనిపించే మాట ఏది ? "ఎంత చేసినా ఇంతే కదా " చివరికి అనిపించే మాట ఇది ఏదైనా కొద్దికాలం బాగుంటుంది.. అన్ని అనుకూలం గా ఉన్నంత వరకు ఎక్కడో ఒకలోపం జరిగిన అన్ని రోజులు చేసింది మర్చిపోయి మాటలు అంటారు అందరూ అలా ఉండరు అని అనకండి అందరూ అంతే కనుకే కుటుంబ లో కలహాలు.. కలహం అనేది అందరి ఇంట్లో సహజం సర్దుకుపోతేనే జీవితం నిజమే కానీ ఎంత సర్దుకుపోయిన ఏమి చేసావు అన్న మాట తప్పదు..ఎంత చేసిన ఇంతే కదా అనుకోక తప్పదు.. ఇదే జీవితం ఇలా ఉంచడమే దైవ నిర్ణయం ఎన్నో పరీక్షలు ఆటుపోట్లు బంధాలు కలపడం దూరం చేయడం ఇలా ఆడుకుంటూ ఉంటాడు వాడు ,పొద్దుగడవని మన దేవుడు కాలక్షేపం కోసమే తననుండి ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించాడు.. అన్ని సుఖాలు పూర్తిగా ఇస్తే ఆ పైవాడ్ని ఎందుకు తలుస్తారు ఇది బాగుందీ అనుకునే దశలో కాలం మారిపోయింది బాల్యం, యవ్వనం ,కౌమారం,వృధ్యాప్యం ఏలా దశలు మారుతూ ముగిసిపోతుందో బంధాలు వారితో ఆనందాలు అన్ని ఒక దశకు అవసరాలుగా మారిపోయింది. అంటే శాశ్వతంగా ఏ ఆనందం చివరి వరకు లేదు ఉండదు అని జీవిత పాఠాలు నేర్పుతూనేఉన్నా గ్రహించే జ్ఞానం కొందరికే ఉంటుంది.. అప్పుడే శాశ్వత మైనా ఆనందాన్ని వెతుకుంటూ వెళ్తారు.. ఎన్నో పూజలువ్రతలు ఇవి తాత్కాలిక ఉపశమనం ఒక క్రమశిక్షణ దేవుడు ఉన్నాడు అనే నమ్మకం వైపు సాధన అది."*
*"మరి జీవితంలో ఏది శాశ్వతంగా ఉండేదే ఇవ్వలేదు అనుకోకూడదు ఇచ్చాడు ఈ జన్మ వరకే ఋణము ఉన్న బంధాలు వాటితో ఆనందలు అన్ని తాత్కాలికం కనుక అవి తాత్కాలికంగా ఇచ్చినా, జన్మ జన్మలకు సరిపడా ఆనందాన్ని మటుకు శాశ్వతంగా ఇచ్చాడు మరి అది ఎక్కడ ఏ రూపంలో ఉంది ఎలా పొందాలి ఎవరిని అడగాలి అంటే ఎక్కడ పెట్టిన వెతికి పట్టేసి ఆ అడ్రెస్సు అందరికి ఇచ్చేస్తారు.. అందుకే శాశ్వత మైన ఆనందాన్ని నీలోనే దాచి పెట్టాడు బాహ్యబంధాలు శాశ్వతం కాదు అని తెలిసాక అయినా నిన్ను నువ్వు వెతుకుంటూ(భగవంతుడు ని) వస్తావు అని వాడికి బాగా తెలుసు బయట వెతికి వెతికి అలసిపోయిన తర్వాత ప్రశాంతంగా కళ్ళు ముసుకునికూర్చుని ఆలోచిస్తారు కదా అక్కడ దొరుకుతుంది శాశ్వత మైన ఆనందం అంటే ధ్యానం నీ లోనే శాస్వత మైన సుఖాన్ని జన్మ జన్మలకు సరిపడా తరగని ఆనంద అమృత బిందువులను దాచాడు ధ్యానంలో నీలో నువ్వు ప్రయాణం మొదలు పేట్టగానే ఆ దైవమే జ్ఞాన చైతన్య మార్గంలో ఆత్మ సాక్షాత్కార ప్రయాణం శాశ్వత స్థానాన్ని ఆనందాన్ని పొందే మార్గం వైపుకి నడిపిస్తుంది."*
*"అక్కడ నీ జీవాత్మ కామేశ్వర ప్రాణనాడి అయిన అమ్మవారు రూపంలో నువ్వే అని తెలుసుకుంటావు మస్తిష్కరంలో సహస్త్రరం లో సహస్ర దళంలో ఉన్నకామేశ్వరుడు ఆ ప్రంజోతిలో ఐక్యం అయిపోతుంది అదే అసలైన ఆనందం శాశ్వతానందం.. అది సాధనలో పొందగలిగితే అదే ఉపాసన శక్తి మళ్ళీ జన్మలో కూడా తోడు ఉంటుంది ,కానీ ఈ జన్మలో సంపాదించిన ఆస్తి మల్లిజన్మకు తోడు రాదు.. శాశ్వత మైన ఆనందాన్ని నీలోనే భగవంతుడు దాచి పెట్టాడు అని ఎవరికైనా తెలిసిన దాన్ని ఎవ్వరు దొంగిలించలేరు..ఎవరికి వారు సాధన ద్వారా సాధించు కోవాలి."*
*"బయట విగ్రహరూపంలో కనిపిస్తున్న దేవుడి నీలో ప్రయాణించి వెతికితే నిజరుప దర్శనం నిజమైన ఆనందం పొందగలరు."*
*"భ్రమ లో బతికే వారికి అవసరం తీరడమే ఆనందం ఎవరికి ఏది లేదో అది పొందడమే ఆనందం ఇది మనవ సహజం ఎందుకంటే మనము మాయలో బతుకుతున్నాను.. ఆ మాయనుండి బయటికి వచ్చాము అందుకే దైవాన్ని తెలుసుకున్నాము అనుకుంటారు అలా అనుకోవడం కూడా మాయే.. నీలో నే శాంతిని దాచాడు తెలివైన దేవుడు తాళాలు నీ చేతికి ఇచ్చి కష్టాలు అవసరాలు అనే వాటిని కాపలాగా పెట్టాడు నువ్వు పొందాలి అంటే ఆ కష్టాలు అవసరాలు అనే కాపలాదారుల్లి దాటి రావాలి ఎప్పటికి దాటేది. అందుకే ఇదంతా ఒక నాటకం అని సాధన చేస్తూనే మీ కర్మలు దాటాలి."*
No comments:
Post a Comment