Friday, March 10, 2023

అనుభవం, కర్మ ఈ రెండూ వ్యక్తిగతమేనా లేక సమిష్టిగా భావించాలా ?

 🙏🕉🙏                    ...... *"శ్రీ"*

                 💖💖💖
       💖💖 *"479"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
     🌼💖🌼💖🌼💖🌼
           🌼💖🕉💖🌼
                 🌼💖🌼
                       🌼
*"అనుభవం, కర్మ ఈ రెండూ వ్యక్తిగతమేనా లేక సమిష్టిగా భావించాలా ?"*

*"ఈ సృష్టిలో ఎవరైనా సరే ఒకరిగా ఉంటే ఏ అనుభవం లేదు. మరొక ప్రాణి లేదా వస్తువుతో సంబంధం లేకుండా ఏ అనుభవం ఏర్పడదు. మన ప్రతి అనుభవం మనం కాక మరొక విషయంపై ఆధారపడి ఉంటుంది. అలాంటి అనుభవంలో మన ప్రమేయంతో నిమిత్తం ఎలా ఉంటుంది ! కర్మ ఏదైనా సృష్టిలోని అంతర్భాగమే. ప్రతి కర్మ మనతో పాటు మరొక ప్రాణి లేదా వస్తువుతో పాటు ఏర్పడిన సమిష్టికర్మ గానే ఉన్నప్పుడు అది కేవలం మన అనుభవం మాత్రమే అని ఎలా చెప్పగలం ? యజ్ఞం చేసేటప్పుడు రెండు చెక్కలను రాపిడి చేసి అగ్ని పుట్టిస్తారు. ఆ రెండు చెక్కలోనూ పరమాత్మశక్తి అగ్నిరూపంలో దాగి ఉంది. అయినప్పటికీ పరస్పర సంబంధం ఉంటేనే అది కార్యంగా మారి వ్యక్తమైంది. ఇప్పుడు వాటి రాపిడి వల్ల వచ్చిన అగ్ని ఏ చెక్కదని చెప్పగలం ? నిజానికి అది రెండింటిదీ కాదు. వాటి మధ్య ఉన్న సంబంధానిది, వాటిలో దాగి ఉన్న ఆ శక్తిది. అలాగే మనం చేసే ప్రతీ కర్మ మరొకరితో సంబంధం ఉన్న సమిష్టికర్మే. మనకు ఎదురయ్యే ప్రతి అనుభవం మరొకరితో సంబంధం ఉన్నదే !"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
             

No comments:

Post a Comment