🙏🕉🙏 ...... *"శ్రీ"*
💖💖💖
💖💖 *"491"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
🌼💖🌼💖🌼💖🌼
🌼💖🕉💖🌼
🌼💖🌼
🌼
*"అన్ని దీక్షల్లోకి ఏది ఉత్తమమైనది ?"*
*"ఇందుకు శ్రీరమణమహర్షి చక్కని సమాధానం చెప్పారు. దీక్షలన్నింటిలో అత్యుత్తమమూ, శక్తివంతము అయినది మౌనదీక్ష అని సెలవిచ్చారు. ఈ దీక్షను శ్రీదక్షిణామూర్తి అవలంబించారు. స్పర్శ, దృష్టి ఇత్యాది దీక్షలు తక్కువ తరమువి. మౌనదీక్ష అందరి హృదయాలను మార్చివేస్తుంది. ఇందులో గురువు లేడు, శిష్యుడూ లేడు. అజ్ఞాని దేహాత్మబుద్ధి కనుక మరొక దేహాన్ని గురువుగా భావిస్తాడు. అది సరేగాని గురువు తనదేహమే ఆత్మ అనుకుంటాడా ? అతను దేహాన్ని అధిగమించిన వాడు, ఆయనకు బేధము లేదు. ఇలాంటి గురుశిష్య భావనను అజ్ఞాని మెచ్చలేడు. జీవుడికి చెందిన అహం దేహానికే పరిమితం. బ్రహ్మమును సూచించే అహం విశ్వావధి. ఉపాధిని తొలగిస్తే అహం ఏకమూ, శుద్ధము !"*
*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
No comments:
Post a Comment