శివుని అనుమతి లేనిదే ప్రవేశం దొరకని క్షేత్రం "అరుణాచలం"-
ఒక్క సారి అరుణాచలం లో ప్రవేశించిన తర్వాత...
మౌనం పాటించండి. (మాట్లాడితే మనసు శివుని మీద ఉండదు)
శివ నామ స్మరణ చేస్తూనే వుండండి. (లేదంటే మన నాలుకకు హద్దు ఉండదు)
వీలైనంత వరకు మితాహారం పాటించండి (లేదంటే స్పృహ శివుని మీద ఉండదు)
సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చెయ్యండి (లేదంటే మనం మనతోనే ఉండలేము ... అక్కడ శివుని తో ఉండాలి)
మన దర్పం చూపకూడదు (అక్కడ శివుడే సుప్రీమ్ ... మనము జీరో)
దంపతులైనా సరే దాంపత్య జీవితం అక్కడ గడపకూడదు (కోరికలు దగ్ధం చేసే అరుణాచలం లో.... కోరికలను తీర్చుకోకూడదు)
వీలైతే అన్నదానం చెయ్యండి (మోక్షానికి దగ్గరవుతారు ..... అది కూడా మోక్షం కావాలనుకునే వారు మాత్రమే )
ఎవ్వరినీ దూషించకండి (అక్కడ శివ పార్వతులు సిద్ధుల రూపంలో... సాధారణ రూపంలో మన మధ్యలోనే వుంటారు)
తప్పదు కాబట్టి .. మీ హోటల్ రూమ్ లో తప్ప... అరుణాచల క్షేత్రంలో ఎక్కడా.. ఉమ్మి వెయ్యకండి. మల మూత్ర విసర్జన చెయ్యకండి.
అరుణాచలం సాక్షాత్తూ శివుడు ప్రత్యక్షంగా సంచరించే గొప్ప క్షేత్రం
ఆయనకు అసౌకర్యం కలిగించేందుకు, మనం అరుణాచలం వెళ్లాల్సిన అవసరం ఉందంటారా ?
సాధారణ పుణ్య క్షేత్రంలా .... కేవలం దర్శనం నిమిత్తం అరుణాచలం రావద్దు ..
ఇది పరమ పావన ఆవిర్భావ అగ్ని లింగ క్షేత్రం .... మనసా వాచా కర్మణా శివ స్పృహతో చేసే యాత్ర... అరుణాచల యాత్ర
ఇంకా అనుమానాలు ఉంటే... చెప్పండి ... తీర్చగలరు (I am VS Rao from TIRUPATI AP)
ఒక్క సారి అర్హత తో కూడిన అరుణాచల దర్శనం చెయ్యగలిగితే ... ఇక మరొక జన్మ ఉండదు!
అయ్యా బాబోయ్... మాకు మళ్ళీ జన్మ కావాలి... మానవ సుఖాలన్నీ అనుభవించాలి అనుకుంటే .... మీ ఇష్ఠమ్ వచ్చినట్లు దర్శనం చేసుకోవచ్చు ... అరుణాచల శివుని... ఎందుకంటె అది కేవలం దర్శనం మాత్రమే అవుతుంది
.... మన మరు జన్మలకు అడ్డం ఉండదు!
మనిషి జీవితాన్ని రెండు భాగాలు గా విభజించదగిన సమయం- అరుణాచల ప్రవేశం.
ఇందులో శివ స్పృహ తో, నియమ నిష్టలతో గిరి ప్రదక్షిణ చెయ్యడం అనేది, కేవలం పుణ్య కార్యం మాత్రమే కాదు, జన్మకు సరిపడా గుర్తుంచుకోదగిన మహా ఘట్టం అవుతుంది.
గిరి ప్రదక్షిణతో మాత్రమే అరుణాచల యాత్ర సంపూర్ణం అవుతుందని మర్చిపోకూడదు.
అరుణాచలం లో ఉన్నంత సేపు మరియు గిరి ప్రదక్షిణలో అనుక్షణం అందరూ గిరి వైపు చూస్తూ శివ నమ స్మరణ చేస్తూనే ఉండాలి. అది కేవలం కొండ కాదు. ఆ కొండ కొండ మొత్తం యోగ నిద్ర లో శ్రీ దక్షిణామూర్తి స్వరూపంలో గౌరీ, గణేశ్, కుమారస్వామి, నంది వార్లతో సజీవంగా కూర్చుని ఉన్న ఆ మహా శివుడే ఆ అరుణగిరి (అరుణ గిరి వాడుక లో తిరువణ్ణామలై ఐనది- తిరు అరుణ మలై- తిరువణ్ణామలై గా మారింది )
అరుణాచలం లో... దక్షిణా మూర్తి గా... స్థూల రూపం లో కొలువైయున్న ఆ మహా శివుడు ప్రత్యక్షమైతే మనం ఆయన్ని ఏమి కోరుతామో ఆయనకి తెలియదు గాని... ఆయన మాత్రం ఒక్కటే కోరుతాడు .... భక్తి పేరు చెప్పి నా భక్తుల్ని ఇబ్బంది పెట్టినా .... మోసం చేసినా.... శివుని రుద్ర రూపం మీరు చూస్తారు అని... అంటే నేను ఎంత కారుణ్య మూర్తి నో.... అంతటి కఠినాత్ముడను ... శిక్షల విషయం లో అని.... కనుక శివ దర్శనం కావాలి అంటే.... తొలుత శివ సమ్మతం సాధించండి ... సర్వం శివోహం!
అత్యంత తేలికగా మోక్షం లభించే మార్గం చూపండి... మాహా ప్రభో... అని మన పూర్వ ఋషులూ మహర్షులు బ్రహ్మను, విష్ణువు, శివుని కోరినప్పుడు ... వారు చూపిన మార్గాలు కడు కష్టతరంగా భావించి, ఎంతో మంది ఋషులు తిరిగి, తిరిగి జన్మిస్తూనే వున్నారు .... కాశీ లో మరణం కన్నా... అర్హత తో కూడిన అరుణాచల యాత్ర మోక్షానికి సులభ మార్గమని తెలిసిన వేల మంది ఇప్పుడు అరుణాచలం లో వన ప్రస్థాశ్రమాన్ని గడిపారని ... స్థాయిని, వేల కోట్లా ఆస్తులను వదిలి, ఇప్పటికీ అక్కడే గడుపుతూ వున్నారని,,, మనలో ఎంత మందికి తెలుసు?
అర్హత గల అరుణాచలేశ్వర యాత్ర చెయ్యగలిగితే, అది తప్పకుండ శివుని అనుగ్రహం !
ఓం అరుణాచలేశ్వరాయ నమః!
No comments:
Post a Comment