Thursday, March 23, 2023

సత్-చిత్-ఆనందం అంటే ?

 💖💖💖
       💖💖 *"503"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
     🌼💖🌼💖🌼💖🌼
           🌼💖🕉💖🌼
                 🌼💖🌼
                       🌼
*"సత్-చిత్-ఆనందం అంటే ?"*

*"దైవానికే సత్-చిత్-ఆనందం అని పేరు. భగవాన్ శ్రీరమణమహర్షి దీని గురించి ఇలా వివరించారు. జీవుడు-ఈశ్వరుడు-బంధమూ ఈ త్రిపుటి అన్ని మతాల్లోనూ సమానమే. మనః ప్రవృత్తి ఉన్నంతవరకే వాని యదార్థము. మనసు లేచిన పిదపనే దైవ ప్రతిపాదనను కూడా ! దైవం ఆత్మకు భిన్నం కాదు. ఆత్మకు దైవ రూపం ఇచ్చారు. గురువుకు సైతం అట్లాగే ఇచ్చారు. సత్ అంటే సదసత్తుల కవ్వల - చిత్ అంటే చిదచిత్తుల కావల - ఆనందం అంటే ఆనంద అనానందముల కావాల. సత్ అంటే ఇప్పటికే ఉండి కూడా మనకు కనిపించనిది. చిత్ అంటే ఉన్నదాన్ని ప్రకాశమానం చేసేది. ఆనందం అంటే ఆ వస్తువు ప్రకాశంచేత మనం గుర్తించినందువల్ల కలిగే మానసిక స్థితి. మనకి ఇంట్లో ఒక పాత ట్రంకుపెట్టె కనిపించింది. దానిపై ఇందులో బంగారు నగ ఉంది అని వ్రాసి ఉంది. అందులో ఉన్నది సత్ అయినా దాని ప్రకాశం మనకు తెలియదు. కాబట్టి ఆనందం కలగడంలేదు. కష్టపడి తెరిచి చూస్తే అందులోని నగ ప్రకాశిస్తుంది. ఆ ప్రకాశమే దాన్ని గుర్తించేలా చేస్తుంది. అలా గుర్తించినందువల్లనే మనసు ఆనంద పడుతుంది !"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
            

No comments:

Post a Comment