Wednesday, March 8, 2023

:::: సమస్య నిర్ధారణ పరీక్ష ::::

 *:::: సమస్య నిర్ధారణ పరీక్ష :::::*

    మనకు తెలుసు దగ్గు వచ్చి డాక్టర్ దగ్గరకు వెళితే అది టిబి వలనా ,కరోనా వలనా లేక ఉబ్బసం వలనా లేక లంగ్ కేన్సరా అని నిర్ధారణ కోసం కొన్ని పరీక్షలు చేయించ మంటాడు.

    అలానే మనకు అనేక నెరవేరని కోరికలు, ఆశలు అలానే పరిష్కారం కాని సమస్యలు  వుంటాయి.
    వీటి కారణం తెలియదు. కర్మ అంటాము.

పరిష్కారం కోసం వివిధ రకాల పనులు చేస్తాము. నిజానికి అవి సమస్యకు సంబంధం లేనివి. ఉదా. అసత్య శక్తులను ఆరాధించడం.

టిబి వలన వచ్చే దగ్గుకి, ఉబ్బసం కోసం వాడే ముందు పనిచేయదు.
 ప్రతి సమస్యకి దాని ప్రత్యేక కారణం వుంటుంది. కనుక కారణం తొలగ కుండా సమస్య పరిష్కారం కాదు.
 ఏ మందు సర్వ రోగ నివారణి కాదు.
 ఏ పరిష్కారం సర్వ సమస్య పరిష్కారిణి కాదు. ఇందుకు ధ్యానం మినహాయింపు కాదు.

*షణ్ముఖానంద 9866699774*

No comments:

Post a Comment