Thursday, March 23, 2023

ఆధ్యాత్మిక ఉన్నతికి సోపానాలు

 ఆధ్యాత్మిక ఉన్నతికి సోపానాలు
                ➖➖➖



*ఆధ్యాత్మిక ఉన్నతికి సోపానాలు...!!*
*వేదాంతం లౌకిక జీవనంలో దేన్నీ వద్దని చెప్పటం లేదు, అన్నిటా మితంగా ఉండమంటుంది.*

*మితాహార వ్యవహారాల ద్వారా ఆధ్యాత్మిక ఉన్నతికి సాధన సులభం అవుతుంది.*

*రోజులో నాల్గవ వంతు నిద్రతో సరిపెట్టుకోగలిగితే నిద్రను జయించినట్లే, *

*ప్రతి పూటా అర్ధాకలితో భోజనం పూర్తి చేయగలిగితే ఆకలిని జయించినట్లే,*

*ఏదైనా పనిచేస్తూ మధ్యలో అన్నంతింటే తిరిగి వెంటనే ఆ పని కొనసాగించేలా ఉండాలి, తిని ఎవరింటికైనా వెళ్తే మళ్ళీ భోజనం చేయగలిగినంత మాత్రమే తింటే అది నిత్యోపాసన అవుతుంది!!...*

*మానవుడు ప్రధానంగా రుచికి, నిద్రకి లొంగిపోతున్నాడు.  అది తగ్గించుకోవాలి, ఉపవాసం పేరుతో భోజనం మానేస్తే దేవుడికి ఏం లాభం...*

*మన మనసును అవసరమైనప్పుడే అదుపులో ఉంచుకోవడం మనోనిగ్రహం అవుతుంది. అంతేగాని మనసును అసలు కదలకుండా చేయటం ఎవరివల్లా కాదు...*

*భక్తి పేరుతో చాదస్తాలు చేసి, దేవుడి పేరుతో వికృత పోకడలు చేస్తే అది మన ఆరోగ్యానికి హాని చేసుకోవడమే ... అంతే కానీ అది ఏమాత్రం ఆధ్యాత్మికత కాదు.
.

No comments:

Post a Comment