Thursday, March 23, 2023

ఆనందస్థితి, మౌనం ఈ రెండూ ఒక్కటేనా ?

 💖💖💖
       💖💖 *"496"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
     🌼💖🌼💖🌼💖🌼
           🌼💖🕉💖🌼
                 🌼💖🌼
                       🌼
*"ఆనందస్థితి, మౌనం ఈ రెండూ ఒక్కటేనా ?"*

*"భక్తుడు, శివలింగం రెండూ ఉన్నవే. ఉనికి ఉన్నది కాబట్టి అవి సత్. ఇద్దరూ కనిపిస్తున్నారు అంటే రెండిటిలోనూ ప్రకాశం ఉంది. అదే ఆనందం. భక్తుడికి శివలింగంతో బంధం ఏర్పడింది అదే ఆనందం. అది బయటకు కనిపించేది కాదు. ఆ ఆనందస్థితికే మౌనం అని మరొక పేరు. గురువు తాను సాధించిన మౌనంతో మనకు అందించే శాంతి కూడా మౌనంగానే ఉంటుంది. అందుకే అది మౌనదీక్ష అయ్యింది. మౌనం రావటం అంటే మాట్లాడక పోవటం కాదు. ఆలోచనలు లేకుండా పోవటం ! అమ్మాయికి పెళ్ళి సంబంధం కోసం వెళ్ళే తండ్రి అబ్బాయి తల్లిదండ్రులకు తన కూతురు గురించి ఎన్నో విషయాలు చెప్పాలని మనసులో సిద్ధం చేసుకుని వెళ్తాడు. అమ్మాయి ఫోటో చూడగానే వారు 'అమ్మాయి నచ్చింది మేము చేసుకుంటాం' అని చెప్తే అతను చెప్పాలనుకుని సిద్ధం చేసుకుని ఉన్న విషయాలతో ఇక పనిలేదు. అప్పుడా విషయాల ఎడల అతని మనసు మౌనం వహిస్తుంది. గురువు ఇచ్చే శాంతి కూడా అలాంటి మౌనరూపంలోనే ఉంటుంది !"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
              

No comments:

Post a Comment