*:::::: మన సంవేదనలే గీటు రాయి ::::::*
మనం నివసిస్తున్న ఈ భౌతిక ప్రపంచం , వివిధ పదార్థాల తోటి, ప్రాణులతోటి, వివిధ శక్తుల తోటి నిండి వున్నది.
మనం చుట్టూ వున్న వీటి అన్నింటి ప్రభావం మన మీద ఎంతో కొంత వుంటుంది.
మనలో కలిగే సంవేదనలే
దీనిని ధృవీకరిస్తూ న్నాయి.
మనలో సంవేదనలు కలిగించ లేని శక్తులు, పదార్థాలు మన చుట్టూ వున్నాయి.
అవి మన జీవితాన్ని ప్రభావితం చేయలేవు . కారణం మన లో సంవేదనలు లేవు. వాటికి మనం స్పందించటం లేదు కనుక.
కనుక మనం స్పందించని శక్తులు మనకు నిత్యం జీవితంలో ఉపయోగ పడతాయి అనడం పెద్ద జోకు.
ఉదా. భూ మాతను పూజించినా లేకున్నా, భూమి అందర్ని ఆకర్షిస్తుంది. ప్రత్యేకం,అదనపు ఆకర్షణ గాని దొరకదు.
భౌతిక శక్తుల ప్రభావం సమానంగా, వివక్ష రహితంగా, ఎల్లపుడూ మనకు అందేవి, అందుతాయి. ఏ కట్టడము, భంగిమ, ప్రార్ధన ఆపలేదు అలాగే పెంచలేదు.
*షణ్ముఖానంద 98666 99774*
No comments:
Post a Comment