*పుత్రులు ఎన్ని రకాలు...*
1. ధర్మపత్నియందు పుట్టిన కుమారుడ్ని "ఔరసుడు" అని అంటారు.
2. కూతురికి పుట్టిన కొడుకుని "దౌహిత్రుడు" అని అంటారు.
3. తల్లిదండ్రులు ఇష్టపడి తన కుమారుని దానం చేస్తే అతన్ని "దత్త పుత్రుడు" అని అంటారు.
4. తన భార్యకు వేరే పురుషుని వల్ల పుట్టిన కుమారుని "క్షేత్రజుడు"అని అంటారు.
5. తల్లిదండ్రులు లేని వానిని తెచ్చి పెంచుకుంటే వానిని "కృత్రిముడు" అని అంటారు.
6. వ్యభిచారిణి అయిన భార్యకు పుట్టిన కొడుకుని "గూఢజుడు" అని పిలుస్తారు.
7. ఒక పిల్లవానిని తల్లిదండ్రులు వదిలి పెట్టేస్తారు. వానిని వేరే దంపతులు పెంచుకుంటారు. అతనిని "అపవిద్ధుడు" అని అంటారు.
8. ఒక కన్య పెండ్లి కాకుండా కొడుకుని కంటుంది. వాడు ఆ కన్యను పెళ్లాడిన వాడికి కొడుకు అవుతాడు. అతనిని "కానీనుడు" అని అంటారు.
9. ఒక గర్భిణీ స్త్రీని పెళ్లాడితే దానికి పుట్టిన కొడుకుని "సహోడుడు" అని అంటారు.
10. భర్త విడిచిన స్త్రీ గాని, లేదా మగడు విడిచిన స్త్రీ గాని, లేదా విధవ గాని ఎవరి వల్లనైనా పుత్రుని కంటే వారిని "పౌనర్భవుడు" అని అంటారు.
11. దిక్కులేని పిల్లవాడు ఒక దంపతుల దగ్గరకు చేరి "నేను మీ కొడుకుగా ఉంటా" అని అంటే వానిని "స్వయం దత్తుడు" అని అంటారు.
12. తల్లిదండ్రులు అమ్మి వేస్తే కొనుక్కున్న స్వజాతి పుత్రునని " ప్రీతుడు" అని అంటారు.
*ఈ పుత్రులందరూ కర్మకు అర్హులు అవుతారు. వీరిలో ఔరసుడు చాలా ముఖ్యుడు.*
No comments:
Post a Comment