🙏🕉🙏 ...... *"శ్రీ"*
💖💖💖
💖💖 *"487"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
🌼💖🌼💖🌼💖🌼
🌼💖🕉💖🌼
🌼💖🌼
🌼
*"మనసుకు మాయ వచ్చి చేరిందా ? మనసే మాయగా ఉందా !?"*
*"మాయ అంటే లేనిది ఉన్నట్లుగా కనిపించటం. ఆధ్యాత్మిక సాధనలో మనసును ఆవరించిన మాయను విడనాడాలని అంటారు. నిజానికి మనసే మాయ అని శ్రీరమణమహర్షి చెప్తున్నారు. ఎందుకంటే నిద్రలో కేవలం మనం మాత్రమే ఉంటున్నాం. అలా ఉన్నామనే ఆలోచన కానీ అనుకోవటం కానీ లేకుండా కేవలం ఉంటున్నాం అంతే ! కానీ నిద్ర లేవగానే మనసు నేను-అది అనే ద్వైత భావం పొందుతుంది. కనుక మనసుకు మరొక మాయ వచ్చి చేరదు. మెలకువ రాగానే రూపం తీసుకునే మనసే మాయగా ఉంది. సత్య వస్తువుకు ద్వైతం అని, అద్వైతం అని ఏదీలేదు, అది ఉంటుందంతే. మెలకువ రాగానే నేను, ఈ సృష్టి వేర్వేరు అనే ద్వైత భావన వచ్చింది. కాబట్టి అద్వైతం అనే మాట వాడాల్సివచ్చింది. పసి పిల్లవాడికి నీళ్ళకు, నిప్పుకు తేడా తెలియదు. అప్పుడు వాడికున్నది అద్వైత భావన అని చెప్పలేం. ఎందుకంటే అసలు తేడానే వాడికి తెలియదు కాబట్టి. తేడా తెలిసిన తర్వాత అది పోగొట్టుకోవటం కోసం అద్వైతం అనాల్సి వస్తుంది !"*
*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
No comments:
Post a Comment