Sunday, March 12, 2023

::::మనం పనులు రెండు రకాలుగా చేస్తాం:::

 *::::మనం పనులు రెండు రకాలుగా చేస్తాం::*

1) *ఆలోచించి చేస్తాం* మనకు, మనపట్ల పూర్తిగా ఎరుకగా వున్నప్పుడు, మన మనస్సు పూర్తిగా స్వేచ్ఛగా వున్నప్పుడు, మనకు మన మీద పూర్తిగా అదుపు ఉన్నప్పుడు, అన్ని పనులు ఆలోచించి చేస్తాం.
      అప్పుడు మనకు కాని ఇతరులకు గాని కష్టం, నష్టం దుఃఖం కలగదు. దీనినే ధ్యాన స్థితి అంటాం.

2) *అనాలోచితంగా చేస్తాం* 
       మనలను ఎవరో ప్రేరేపించి నప్పుడు,లేదా మనలను మన స్వార్ధ కోరిక, లేదా నమ్మిన  నమ్మకాలు ప్రేరేపించినప్పుడు, లేదా పరధ్యానంగా వున్నప్పుడు,లేదా ఆవేశాలు ఆవరించి వున్నప్పుడు,లేదా యాంత్రికంగా, అలవాట్లు వున్నప్పుడు, మనం అనాలోచనగా పనులు చేస్తాము. ఇవి మనకు ఇతరులకు కీడు చేస్తాయి.

           ధ్యానం మనలో శాస్త్రీయతని, హేతుబద్ధతని పెంపొందిస్తుంది.

*షణ్ముఖానంద 9866699774*

No comments:

Post a Comment