[4/3, 16:11] +91 73963 92086: 🌹 శ్రీ రమణీయం - 10🌹
👌మనసు పెడితే అంతా దైవ స్మరణమే👌
✍️ శ్రీ గెంటేల వెంకటరమణ
నమో వేంకట రమణాయ,
అద్వైత నిధయే నమః
✳️🌹🌹🌹🌹✳️🕉️✳️🌻🌻🌻🌻✳️
🌈 *10. మనసు పెడితే అంతా దైవ స్మరణమే* 🌹
✳️ ఈ సృష్టిలో దైవానికి భిన్నంగా ఏదీ లేదన్న భావన స్థిరపడితే మన ప్రతి స్మరణ దైవ స్మరణే అవుతుంది. అప్పుడది సహజ దైవ ధ్యానం అవుతుంది. భక్తి, యోగ, (విచారణ) జ్ఞానమార్గాల్లో ఏదో ఒక దాన్ని అవలంబిస్తూపోతే ఆ దైవం యొక్క వైభవం, విస్తృతత్వం మనకు అవగాహనలోకి వస్తుంది. అది ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న ఈశ్వరుడ్ని గుర్తించేంత విశాలం కావాలి. నీలో ఉన్నది కూడా ఆ దైవమేనని తెలిస్తే, ఆ దివ్యత్వాన్ని నువ్వు అనుభవించ గల్గితే అప్పుడు ఈ విశ్వమంతా నిండి ఉన్నది ఆ దివ్యత్వమేనని నీకు అర్థం అవుతుంది. అదే భగవాన్ మనకు బోధిస్తున్న విచారణ మార్గం.
✳️ ఈ విచారణ అలవడాలంటే భగవద్గీతలో చెప్పినట్లు మనకు బుద్ధియోగం, గురుశుశ్రూష అవసరం. ‘బుద్దియోగం అంటే మనసు వివేకాన్ని కలిగి ఉండటమే’ ఈ సృష్టిలోని చాలా జీవరాసులు కన్నా మనకు అదనంగా ఉన్నది ఆ వివేకమే. ముందు ఆ వివేకాన్ని కలిగి బుద్ధిమంతుడిగా ఉంటే కానీ జీవితమైనా, సాధన అయినా సజావుగా సాగుతుంది. గురుశుశ్రూష వల్ల ఈ బుద్ధి మరింత వివేకమై దైవాన్ని గుర్తించగల్గుతుంది. అందుకు ఏది మంచి, ఏది చెడు అని వివేచన చేసుకోగలుగుతుంది. సత్యాసత్యాల విశ్లేషణతో మనం శాంతిని పొందేందుకు మనలోనే ఉన్న దైవాన్ని తెలుసుకొనేందుకు విచారణ సహకరిస్తుంది.
✳️ ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ భగవాన్ *'ఈశ్వరో గురురాత్మేతి'* అన్న విషయాన్ని గుర్తు చేశారు. ఈశ్వరుడు, గురువు, ఆత్మ ఈ మూడు ఒకటే అయితే ప్రస్తుతం మనం దేహత్మ భావన వల్ల ద్వంద్వ వైఖరితో ఉన్నాం కనుక గురువుని, దైవాన్ని మనకంటే వేరుగా ఏదో ఒక రూపంలో చూసుకోవాల్సిందే. మనలో ఉన్న ఆత్మ కూడా దైవమే అని తెలిసిన రోజున మనకూ గురువుకూ, మనకూ దైవానికీ భేదం కనిపించదు. అది సాధించే వరకూ దైవారాధన, గురుశుశ్రూష చేయడం వలన సాధన సులువు అవుతుంది. ఈ అనుభవాన్ని మనకు గురువు అందిస్తారు. సద్గురువు ఎప్పుడూ తన అనుచరులకు తన ఆత్మానుభవాన్ని పంచాలనే ప్రయత్నంలోనే ఉంటారు.
✳️ నిజానికి ఆత్మానుభవం మనకు ప్రతిరోజు, ప్రతిక్షణం జరుగుతూనే ఉంది. మన మనసు శరీరాలు చైతన్యంతో ఉండటమే ఇందుకు ప్రమాణం. గురువు మనకి జరిగే ఈ ఆత్మానుభవాన్నే మనం తెలుసుకునేలా చేస్తారు. 'తనకు తాను తెలిసే ఆత్మ నాకు ఎందుకు తెలియడం లేదు'? అని ఒక భక్తుడు అడిగిన ప్రశ్నకు భగవాన్ సమాధానం చెప్తూ... ‘ఆ ప్రశ్న వేసేదే నీ ఆత్మశక్తితో” అన్న విషయంతెలియకనే' అన్నారు. ఎవరైనా మన వద్దకు వచ్చి“నాకు మనసు ఉందా'? అని ప్రశ్నిస్తే మనం ఏమని చెప్తాం?..అసలు ఆ మనసు ఉండబట్టే కదా ఆప్రశ్న పుట్టింది, అలాగే మనలో ఉన్న ఆత్మ చైతన్యం వల్లనే మన మనసు, దేహం పని చేస్తున్నాయని, అనుభవ పూర్వకంగా తెలుసుకున్న రోజు ఈ సంశయం పోతుంది. ఈ అనుభవానికి ముందు వివేకంతో మనం అవగాహన చేసుకోవడం అవసరం. అదే భగవాన్ చెప్పే విచారణ.
✳️ ఇదే విషయాన్ని జిల్లెళ్లమూడి అమ్మవారు *'ఆత్మను తెలుసుకోకపోవడమే తప్ప అది తెలియక పోవడంకాదు'* అంటున్నారు. మన మనసును మనం విశ్లేషించుకుంటే, ఆ మనసు ఎక్కడ నుండి పుడుతుందో శోధించ గలిగితే 'ఆత్మ' శక్తే మూలం అని తెలుస్తుంది.
✳️ మనకు అహంకారాలు అనేకం కలుగుతూ ఉంటాయి. అన్నిటికీ ఆధారంగా ఉన్న 'అహం’ మాత్రం ఒక్కటే. నేను నవ్వుతున్నాను, నేను ఏడుస్తున్నాను, నేను ఆందోళనతో ఉన్నాను... అనడంలోనే అన్నింటిలోనూ 'మారని' 'నేను' ఒకటి ఉందని తెలుస్తుంది కదా! అదే 'అహం'. ఈ అహనికి మూలమే ఆత్మ. మన మనసు పంచేంద్రియాల ద్వారా అనుభవాలను పొందుతుంది. నీకొక విషయం తెలియాలంటే చూపు ద్వారానో, వినడం ద్వారానో, స్పర్శ ద్వారానో, వాసన ద్వారానో, రుచి ద్వారానో తెలియాలి తప్ప మరో మార్గం లేదు. మిగిలిన అన్ని ఇంద్రియాలు పనిచేయని నిద్రావస్థలో కూడా బిగ్గరగా పిలిస్తే పలికే శక్తి నీ మనసుకి ఉంది. శబ్దానికి నీలో ఉన్న స్పృహను మేల్కొలిపే శక్తి ఉన్నట్లే మనం జపించే మంత్రానికీ స్మరణకీ మనకి తెలియకుండా ఉన్న దైవస్పృహను లేపే శక్తి ఉంది. దైవం తన స్వరూపాలతో 'ఆత్మ'గా అనుభవం అవడానికి ముందు మన పంచేంద్రియాలలో ఏదో ఒక అనుభవం ద్వారా తన దివ్యత్వాన్ని చాటవచ్చు. ‘మంత్రం’ అంటే 'మాటే' తనకు ఉన్న ఆత్మ శక్తి ద్వారా మంత్రానికి బలాన్ని ఇచ్చేది ఆ మనసే. ఎందుకంటే ఆ మనసు దైవానుగ్రహమైన 'ఎరుకే’ కనుక. అదే మనసుని ఆయుధంగా చేసుకొని గురువు మనని జయించేస్తారు. మనలో ఉన్న ఆ ఆత్మశక్తి అన్నింటినీ మనకి తెలియజేస్తుంది గానీ అదేమిటో తెలియకుండా ఉంది. ఎందుకంటే ఆత్మజ్ఞానం అనపేక్షమైనది. మన మనసుకు కేవలం సాపేక్ష జ్ఞానం మాత్రమే ఉంది. అయినా మనసు దైవస్మరణలో లయం అయితే గానీ అనపేక్ష జ్ఞానంతో లభించే ఆత్మానుభూతి కలుగదు. విచారణ మార్గం ద్వారా ఈ మనసు చేసే పోకడలేవీ శాశ్వతం కాదనీ, శాశ్వత వస్తువే మనకు శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుందనీ తెలుస్తుంది. ఈ విచారణే బాహ్య విషయాలపై వైరాగ్యాన్ని, ఆత్మను తెలుసుకోవాలన్న శుభేచ్చను మనకు కలిగిస్తుంది.
[4/3, 16:11] +91 73963 92086: ✳️ ఒక వ్యక్తికి పక్కన మరొకవ్యక్తి ఉన్నాడో లేడో తెలుసుకోవాలంటే స్పర్శ, శబ్ధం, వాసన వంటి ఇంద్రియ లక్షణాలు అవసరం. తాను ఉన్నట్లు తనకు తెలియాలంటే కటిక చీకట్లో సైతం తెలుస్తూనే ఉంది కదా! అదే అనపేక్ష జ్ఞానం. అక్కడ ఇంద్రియాలతో పనిలేదు. ఏ ఆలోచనలు రానీయక సుఖంగా ఉన్న మనసే దైవం. దాన్ని అలా ఉంచేందుకే ఈ విచారణా మార్గంలో మన సాధన. అందుకే ఈ సృష్టినే (ప్రపంచాన్ని) మనం ఉపకరణంగా మార్చుకోవాలి. ఈ సృష్టిలో ప్రతి వస్తువు ద్వారా వ్యక్తం అయ్యే ఈశ్వరానుగ్రహన్నే మనం గుర్తించాలి. తల్లి కడుపులో పిండంగా ఎదిగే దైవం తన పోషణ కోసం అదే తల్లి స్థనాల్లో పాలుగా తయారౌతున్నాడు. ప్రతిజీవి యొక్క పోషణ భారం తానేవహిస్తున్నాడు. అందుకే జిల్లెళ్లమూడి అమ్మవారు “నాకు ఎదురుగా గడ్డిమోపులు, ఆవులు వాటి పేడ ఉంది. అదే 'పేడ' పొలంలో ఎరువుగా ఉంది. అక్కడే పెరిగిన పైరు ఉంది. బస్తాలో ధాన్యపు గింజలు, మన కడుపులో అన్నం ఉన్నాయి. ఇందులో ఏది దైవం కాకుండా పోయింది.?” అని ప్రశ్నించారు. ఉపయోగం అనేమాట గొప్పది. దగ్గరై కలిసి పోవడమే ఉపయోగం రెండు వస్తువుల్లోనూ ఒకేశక్తి ఉంటేనే ఇది సాధ్యపడుతుంది. మనం అరటి పండుతిని అరిగించుకుంటున్నాము, అంటే అదే కారణం. మనలను నడిపించే ఆత్మ శక్తే సృష్టి అంతటా అంతర్లీనంగా ఉంది. ఆ అరటి పండులోను అదే ఆత్మశక్తి నిబిడీకృతమై ఉండటము వల్లనే మనకు ఉపయోగపడుతుంది. అలాగే ఈ సృష్టి అంతటా ప్రతి వస్తువులోనూ ఒక 'ఉపయోగం' ఉంది. అది గుర్తించటమే తపస్సు. అంటే స్వార్థంతోగాక ఆ వస్తువు యొక్క ప్రయోజన రూపంలో ఉన్న ఈశ్వరుణ్ని చూడాలి. విషంలో కూడా ఆ దైవం ఔషధగుణంగా, కొన్ని ప్రాణుల పోషణకు ఆధారంగా ఉంటుంది కదా! ఈ సృష్టి అంతా భగవంతుడి ప్రణాళికతో నడుస్తున్నప్పటికీ మనిషి మాత్రం ఏదో ఒక పనిని తనకు ఆపాదించుకొని 'అహంకరణ' పొందుతున్నాడు. ఆ అహంకరణే మనలో జీవుడిగా పిలువ బడుతున్నాడు. ప్రతిరోజూ నిద్రలో ఈ అహంకరణ అదృశ్య మవుతూనే తిరిగి మెళుకువలో ఉదయిస్తుంది. అంటే ఆలోచన అణిగిపోవడమే అహంకరణ 'నాశనం'. తాను ఉన్నట్లు తనకి తెలియడం జననం, అది పోవడం మరణం: సుఖదుఃఖాలు ఆ అహంకరణాలే. తేనెలో తీపి కలిసి ఉన్నట్లుగానే దైవం మనలో మనసుగా కలిసిపోయి ఉన్నాడు. ఈ విషయాన్ని వివేకంతో తెలుసుకొని దివ్యత్వాన్ని అనుభవించటమే మన పరమావధి.
❀┉┅━❀🕉️❀┉┅━❀
🌈 చివర మెట్టే భగవాన్ మొదటి మెట్టు 🌹
✳️ సద్గురువు చేసేబోధ మనం స్వీకరించే తీరును బట్టి ఉపదేశంగానో, ఉపన్యాసంగానో కనిపిస్తుంది. స్వీకరించే మనసుంటే మౌనమైనా ఉపదేశమే.
✳️ ఒక జాలరి తన చేపలు పట్టే పనిని త్వరగా ముగించి, వాటిని అమ్మిన సొమ్ములతో హాయిగా భోజనంచేసి తిరిగివచ్చి తన పడవపై ప్రశాంతంగా పడుకున్నాడు. అది చూసిన ఓ ధనవంతుడు అలా ఖాళీగా ఉండకపోతే ఇంకా చేపలు పట్టి అమ్ముకొని సొమ్ములు సంపాదించవచ్చు కదా! అని సలహా ఇచ్చాడు. దానివల్ల ఫలమేమిటని జాలరి ప్రశ్నించాడు. ఆ సొమ్ములతో మంచి ఇల్లు, దుస్తులు, భోజన సౌకర్యాలు కల్పించుకోవచ్చు కదా! అన్నాడు ధనికుడు. వాటి వలన ఫలితం ఏమిటని తిరిగి ప్రశ్నించాడా జాలరి. “ఫలితం అంటావేంటీ భోగాలలో తేలియాడితే బోలెడు సుఖం వస్తుంది కదా!” అన్నాడా ధనికుడు. “నువ్వు చెప్పే ఆ సుఖాన్ని నేను ఇప్పుడే పొందుతున్నాను కదా! ఇంత కష్టపడటం ఎందుకు?” అని బదులిచ్చిన జాలరి తిరిగి తన పడవలో సుఖంగా పడుకున్నాడు.
✳️ శ్రీ రమణ భగవాన్ కూడా అన్ని బోధల అనంతరం మన మనసు ఏ మౌనాన్ని శాంతిని చేరుకుంటుందో విచారణ మార్గం ద్వారా అదే తన తొలిమెట్టుగా చేసుకొని 'మౌనంతోనే' ఉపదేశాలిచ్చారు గానీ ఉపన్యాసాలు కాదు.
🙏 ఓం నమోభగవతే శ్రీరమణాయ 🙏
సేకరణ:
✳️🌹🌹🌹🌹✳️🕉️✳️🌻🌻🌻🌻✳️
No comments:
Post a Comment