[4/24, 17:29] +91 85198 60693: అరుణాచలం గిరిప్రదక్షిణలో దేవతల చేత ప్రతిష్టించిన శివలింగాలు ఉన్నాయంటారు వాటిని ప్రతి ఒక్కరు ప్రదక్షిణ చేసేటప్పుడు కచ్చితంగా దర్శించాలంటారు కదా అవి ఏవి?
[4/24, 17:31] +91 85198 60693: స:అరుణాచల గిరి ప్రదక్షిణలో అష్ట దిక్కులకు ప్రతీకగా అష్ట శివ లింగాలు ఆయా దిక్పాలకుల దేవతల చేత ప్రతిష్ట జరిగింది.ఆయా శివలింగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.అవేంటంటే తూర్పు దిక్కున ఇంద్రుడు ప్రతిష్ఠించిన ఇంద్ర లింగం,ఆగ్నేయ దిక్కున అగ్ని దేవుడు ప్రతిష్టించిన అగ్ని లింగం,దక్షిణ దిక్కున యముడు ప్రతిష్టించిన యమ లింగం,నైరుతి దిక్కున నిరుతి అనే గంధర్వుడు ప్రతిష్టించిన నైరుతి లింగం,పశ్చిమ(పడమర) దిక్కున వరుణ దేవుడు ప్రతిష్టించిన వరుణ లింగం,వాయువ్య దిక్కున వాయు దేవుడు ప్రతిష్టించిన వాయు లింగం,ఉత్తర దిక్కున కుబేరుడు ప్రతిష్టించిన కుబేర లింగం,ఈశాన్య దిక్కున ఈశానుడు అనే యక్షుల రాజు ప్రతిష్ఠించిన ఈశాన్య లింగం అనే అష్ట లింగాలు ఈ గిరికి 8 దిక్కుల్లో ఇలా దేవతలు 8 లింగాలని ప్రతిష్ట చేశారంటే అరుణాచలం ప్రదక్షిణ వైభవం ఎటువంటిదో ఎంత శక్తివంతమైనదో మనకు తెలుస్తుంది.
No comments:
Post a Comment