అష్టమూర్తి తత్వం అంటే ఏమిటి? దానిని గురించి వివరించండి?
స:మనకు సృష్టిలో "మాయ" అనే దాని విని ఉండి ఉంటాం కదా.అస్సలు మాయ అంటే ఏంటో చాలామందికి తెలియదు ఏదో సరదాకి ఆ మాట వాడుతుంటారు కొందరు ఇంకా మన మాటల్లో,పురాణాల్లో కూడా విని ఉంటాం.ఈ సృష్టి మొత్తాన్ని ఎనిమిది రకాలుగా నిర్మించాడు పరమేశ్వరుడు.దానిని ప్రకృతి అంటారు.అవేంటంటే ఆకాశం, వాయువు,నీరు,అగ్ని,భూమి,మనస్సు,బుద్ధి,అహంకారం.దీనినే మాయ అంటారు ఈ సృష్టిలో నువ్వు చూసేవన్నీ,ఆలోచించేవన్ని ఈ ఎనిమిదిలోనే ఉంటాయి అంటే చిన్న వైరస్ నుంచి బ్రహ్మాన్డం వరకు ఈ ఎనిమిదిని దాటి వెళ్ళదు. వీటిని ఉపయోగించి సృష్టి చేస్తాడు పరమేశ్వరుడు.ఈ ఎనిమిది కాకుండా ఇంకో 9వ పదార్థం(ఏం అనాలో తెలియక ఇలా అన్నాను) ఉంది అదే పరమాత్మ.దాన్ని రకరకాలుగా పిలుస్తుంటారు బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్లు అందరూ.ఈ ఎనిమిది ని ప్రకృతి అంటారు.ఇదే సమస్త జీవులకు తల్లి ఇంకా పరమేశ్వరుడు తండ్రి వంటి వాడు.ఈ ఎనిమిదింటిని ఈ సృష్టిలో ఏ జీవి దాటలేదు.పరమేశ్వరుడి పూర్ణమైన అనుగ్రహం ఉన్నవాళ్లు మాత్రమే దాటుతారు అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్తాడు.పరమేశ్వరుడు ఈ ఎనిమిదింటికి సంకేతంగా 8స్వరూపాలు తీసుకుని ఈ సృష్టి మొత్తం కూడా తానే అని కొన్ని మూర్తులుగా కొన్ని చోట్ల వెలిసాడు.ఆ మూర్థులనే అష్టమూర్థులుగా పిలుస్తారు.అవే చిదంబరం లో ఆకాశ లింగం,శ్రీ కాళహస్తి లో వాయు లింగం,అరుణాచలం లో అగ్ని లింగం,జంబుకేశ్వరం లో జల లింగం,కంచిలో పృథివీ లింగం,కోణార్క్ లో సూర్య లింగం(బుద్ధికి ప్రతీక),పశ్చిమ బెంగాల్ లో చంద్ర లింగం(మనస్సుకు ప్రతీక),కాట్మండు లో యజమాని(నేను అనే అహంకారానికి ప్రతీక)లింగంగా వీటిని చెప్పుకుంటారు.దీన్నే అష్టమూర్తి తత్వం అంటారు.
భూరంబాంస్య నలో నీలొంబర మహార్నాధో హిమాన్సుహు పుమాన్
ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యాఐవ మూర్తిఅష్టకమ్ ౹
నాన్యత్ కించన విద్యతే విమృశతామ్ యస్మాత్పరస్మా ద్విభో
తస్మై గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే౹౹🙏
No comments:
Post a Comment