Sunday, April 2, 2023

::::::కాల వ్యవధి. ::::::

 *:::::::::::::కాల వ్యవధి. :::::::::::*

     బాహ్య ప్రపంచం (అనగా రూపం, గంధం, శబ్దం, రసం, స్పర్శ,)  మన ఇంద్రియాల ద్వారా ఎల్ల వేళలా మనలో ప్రేరణలు కలిగిస్తుంది. ఈ ప్రేరణలకు మనం ప్రతి స్పందిస్తాము.  
   దాదాపుగా మనం  ప్రతి స్పందించే తీరు  ఒక అలవాటుని ఒక తీరుని ఒక నమూనాని కలిగి ఒక అసంకల్పిత యాంత్రిక చర్య లాగా వుంటుంది.  మన నియంత్రణ, పట్టు వుండదు. అందువల్ల  సరి తూగవు.
    *కాని ఒక చిన్న అవకాశం వుంది.అది ఏమిటంటే. కాల వ్యవధి.*
    బాహ్య ప్రేరణకి  మన స్పందనకి మధ్య  కాలవ్యవధి.
   ఈ కాల వ్యవధి లో మనం ఎన్ని రకాలుగా స్పందించ వచ్చో, ఎలాంటి స్పందన సరితూగ గలదో,  నిర్ణయించ వచ్చు.
    *ఏకాగ్రత* మనకు ఈ వ్యవధి ని ఇస్తుంది. 
*సతి, అంతర్దృష్టి* ఎలా స్పందిస్తున్నాం  అని చెపుతుంది 
 *ప్రజ్ఞ* ఏది సరైన స్పందనో చెపుతుంది. 
*శీలం* శీలాచరణకు దారితీస్తుంది.

  *షణ్ముఖానంద 98666 99774*

No comments:

Post a Comment