[4/20, 16:41] +91 85198 60693: ఎవరు ఈ అరుణ గిరియోగి? ఆయనకు అరుణాచలానికి సంబంధం ఏమిటి? ఆయన్ని దక్షిణామూర్తి స్వరూపమని ఎందుకంటారు? ఆయనకు దక్షిణామూర్తికి ఉన్న సంబంధం ఏమిటి?
[4/20, 16:42] +91 85198 60693: స:అరుణాచలం కొండ ఈ సృష్టిలోని మొట్ట మొదటి అతి పెద్ద శివలింగం.ఈ సకల సృష్టి జరగక మునుపు అంతా నిరాకార,నిర్గుణంగా ఉన్నప్పుడు ఒక సంకట స్థితిలో తనకు తాను అవ్యక్తంలో నుంచి వ్యక్తంలోకి రావడానికి వచ్చిన మొదటి స్వరూపం తేజోమయమైన అగ్ని లింగం.తర్వాత సదా శివుడిగా ఉద్భవించాడు సకల సృష్టి ప్రదాత అయిన ఈశ్వరుడు.సదా శివుడే ప్రకృతి,పురుషులుగా రెండుగా విడిపోయి ఆది దంపతులుగా మారాడు.బ్రహ్మ మానస పుత్రులైన సనక,సనంద,సనత్కుమార,సనత్సుజాత అనే వాళ్ళు బ్రహ్మ జ్ఞాన సందేహ నివృత్తి కోసం వీళ్ళు బ్రహ్మ,విష్ణువు,సదా శివుడి దగ్గరకు వెళ్తే వాళ్ళు అమ్మతో కూడి ఉండడం చూసి తమ అజ్ఞానంతో వీళ్ళు మనకు బ్రహ్మ జ్ఞానం ఉపదేశం చేస్తారా అని అమాయకంగా వెళ్లిపోతుంటే పరమేశ్వరుడు జాలిపడి సృష్టిలోనే మొట్టమొదటి గురు స్వరూపం,ఆది యోగి స్వరూపం అయిన దక్షిణామూర్తి అవతారం తీసుకున్నారు.ఆ అవతారంలో ఎవరికి ఏ ఇబ్బంది కలగని జ్ఞాన బోధ(ఈ సృష్టిలోని అన్ని గురు స్వరూపాలు చెప్పే మాటలు ఎవరికో ఒకరికి అయినా బాధ అయింది.కానీ ఒక్క దక్షిణామూర్తిగా వచ్చిన సదా శివుడు ఎవరికి ఏ బాధ లేని మౌన ముద్రాలంకితుడై చిన్ముద్ర పట్టి మౌనోపదేశం)వారికి చేసాడు.ఈయననే తర్వాత బ్రహ్మాది దేవతలు,ఋషులు రకరకాలుగా ఉపాసించి సర్వమూ సిద్ధింప చేసుకున్నారు.ఈ దక్షిణామూర్తి యే అరుణాచలంకి ప్రధాన అధికారి ఆయనే అరుణగిరి యోగి.ఆయనను మన కళ్ళతో మనం చూడలేక పోవచ్చు కానీ అరుణగిరి ప్రదక్షిణ చేసే ప్రతి ఒక్కరినీ ఆయన చూస్తుంటాడు ఇంకా గమనిస్తుంటాడు ఇది చాలదా ప్రతి జీవి జన్మకి తరించిపోవడానికి ఆ స్వామి అనుగ్రహము కోసం ఆ ప్రదక్షిణ చేస్తే చాలు ఆయన మనల్ని చూసేస్తాడు.అరుణాచలం కొండ కర్మల్ని దగ్ధం చేసే శివ స్వరూపం అయితే ఆలయంలోని శివ లింగం మనలోని భక్తిని తీసే శివ స్వరూపం కదా ఇక దక్షిణామూర్తి(అరుణ గిరి యోగి) జ్ఞానాన్ని ఇచ్చే శివ స్వరూపం.ఈ మూడు ఆయనే కదా అందుకే ఇప్పటికి బ్రహ్మాది దేవతలు,ఋషులు కాంతి స్వరూపాలతో వచ్చి అక్కడ అరుణగిరి యందు ఉన్న గుహలోకి వెళ్లి ఒక పెద్ద వట వృక్షం కింద ఉన్న ఆశీనుడైన మహా తేజస్సుతో వెలిగిపోతున్న దక్షిణమూర్తిని చూస్తూ ఆయన శక్తిని అనుభవిస్తూ రక రకాలుగా(నృత్య,వాయిద్యాలతో,పాటలతో)ఉపాసిస్తుంటారు.మనం చేయగలిగింది మాత్రం అరుణగిరి వైపు గర్భాలయం దగ్గర నుంచి చూస్తూ నమస్కారం చేసుకోవడమే తప్ప ఆయనకి ఇంకేం చేయలేము.
No comments:
Post a Comment