Saturday, April 29, 2023

****అసలు మన యదార్ధ నిజస్థితి ఏమిటి ? అదెలా ఉంటుంది !?

 అసలు మన యదార్ధ నిజస్థితి ఏమిటి ? అదెలా ఉంటుంది !?
మన నిజస్థితి మనకు తెలియకపోవటమే మాయ. మన నిజ, యదార్ధ, సహజస్థితి శాంతే. మన మనసుకు రెండు రకాల భావాలు తెలుసు. ఒకటి సంతోషంగా ఉండటం. రెండోది దుఃఖపడటం. ఈ రెండూ కలగనప్పుడు మన మనసుకు ఒక స్ధితి ఉంటుంది. అంటే ఏ ఆలోచన కలగని స్థితి. పరీక్షలు వ్రాసిన విద్యార్థి ఫలితాలు వచ్చే రోజు వరకు నిర్లిప్తంగా ఉంటాడు. అది అతడి సహజత్వం. ఫలితాలు చూసినప్పుడు ఉత్తీర్ణుడైతే సంతోషిస్తాడు. లేదంటే దుఃఖిస్తాడు. ఈ రెండింటికీ మధ్య ఉన్న మొదటి స్థితే వాడి నిజస్థితి. అలాగే ఆధ్యాత్మికంగా నేను ఆత్మనా ? దేహాన్నా ? అనే ప్రశ్నలు కలుగని స్థితి మన యదార్ధస్థితి. శాంతిగా ఉండటం అంటే మనసుకు ఏ అశాంతి కలగకపోవటం. శాంతి ప్రత్యేకంగా వచ్చేది కాదు. శాంతే మన సహజస్థితి. అశాంతే వచ్చి పోతూ ఉంటుంది !                                                 ప్రశ్న: ఆత్మ గురించి తెలుసుకోవటం అంత కష్టతరమవటం – భగవంతుని కఠిన మైన లీలేనా?
మహర్షి: ఆత్మ జ్ఞానమంటే ఆత్మగా ఉండటమే. ఆత్మగా ఉనికే, అంటే నీ ఉనికే. ఎవ్వరూ తన ఉనికిని కాదనలేరు కదా. కళ్ళని స్వయంగా చూచుకోలేక పోయినా తనకి కళ్ళు లేవని ఎవరూ అనలేరు కదా. అద్దం ముందు నిలబడి నీ కళ్ళని నేరుగా చూస్తావు – అట్లాగే ఆత్మ కూడా వేరేదానిగా భావించాలనుకుంటావు. ఉన్న చిక్కంతా ఇదే. ఈ వేరేదానిగా ఎప్పుడూ భావించుకోవడం వల్లె నీ గురించి జ్ఞానాన్ని పోగొట్టుకున్నావు.ఆత్మని అట్లా భేదభావంతో ఉహించలేం. ఆత్మని తెలుసుకోవలసిందెవరు? జడపదార్ధమైన శరీరం తెలుసుకోగలదా?ఎప్పుడూ నీగురించి చెప్పుకుంటావు, ఆలోచిస్తావు కానీ నేనెవరో తెలియదంటావు. నువ్వే ఆత్మవి అయినా ఆత్మని తెలుసుకోవటమెట్లా అని అడుగుతావు. ఇందులో భగవంతుని లీల గానీ కాటిన్యం కానీ ఎక్కడ నుంచి వచ్చాయి. ఆత్మని మనుష్యులు తెలుసుకోలేక పోవడం వల్లనే శాస్త్రాలు మాయ గురించి, లీల గురించి చెప్తాయి.

No comments:

Post a Comment