Sunday, April 2, 2023

:::::నేను కు భయం వేసే ఒంటరి తనం:::::

 *నేను కు భయం వేసే ఒంటరి తనం*
      ఏదీ కాని నేను, ఏమీ లేని నేను, ఏదో ఐపోవాలని ఎప్పుడూ దేనినో ఒక దానిని పట్టుకొని వ్రేలాడుతుంది. అది దేనిని పట్టు కుందో దానినే నేను  అంటుంది. ఉదా. శరీరాన్ని పట్టుకొని శరీరమే నేను అంటుంది.
       అలాగే దేనినో నింపుకుని ఉంటుంది. దేనిని నింపు కున్నదో  చివరకి అదే  నేను అవుతుంది. ఉదా. వివిధ భావాలు  నింపుకొని ఆ భావాలే నేను అంటుంది.
     దేనితోనే  తదాప్యం చెందుతుంది.  దేనితో తదాప్యం చెందిందో,  అదే నేను అంటుంది. ఉదా కోపంతో తదాప్యం చెంది నేనే కోపాన్ని అంటుంది.
             ఒక్కొక్క సారి నేనుకు ఏమీ దొరకదు. అప్పుడు తన డొల్ల తనం తనకే ఎరుక లోకి వస్తుంది. అప్పుడది ఒంటరిదై, ఏమీ కానిదై తల్లడిల్లుతుంది .
       కనుక ఒంటరి తనం అంటే ఎవరూ లేని ఒంటరి తనం కాదు. ఏమీ కాని నేను అనుభవించే డొల్ల తనం.
   ధ్యానం ఏకాంతాన్ని ఇస్తుంది.
*షణ్ముఖానంద 98666 99774*

No comments:

Post a Comment