[4/13, 16:44] +91 85198 60693: అరుణాచల గిరిప్రదక్షిణ ఎవరు చేశారు? ఏ భావనతో చేశారు?
[4/13, 16:45] +91 85198 60693: అరుణాచల గిరి ప్రదక్షిణ చాలామంది మహాత్ములు చేశారు.శివుని అవతారమైన జగద్గురు ఆది శంకరాచార్యులు,ఆది శేషుని అవతారమైన భగవత్ రామానుజాచార్యులు,సుబ్రహ్మణ్య అవతారమైన భగవాన్ రమణులు,నడిచే దైవం శ్రీశ్రీశ్రీ కంచి పరమాచార్య స్వామి,గుహ నమ శ్శివాయ ఇంకా గురు నమశ్శివాయ(అష్ట సిద్ధులు ఉన్న యోగి పుంగవులు)అనే గురు,శిష్యులుగా ఉన్న పరమేశ్వర భక్తులు,జ్ఞాన సంబంధర్ నాయనార్,మాణిక్య వాచకర్ నాయనార్,సుందర మూర్తి నాయనార్,అప్పర్ నాయనార్(నాయనార్లలో వీళ్ళు చాలా చాలా గొప్పగా చెప్పుకోదగినవారు 63మందిలో అందరూ గొప్పవారే కానీ వీళ్ళు రాజుకు మకుటం వంటి వారు),విరూపాక్ష స్వామి,శేషాద్రి స్వామి,కావ్య కంఠ గణపతి ముని(గణపతి అంశ స్వరూపం,మహా మంత్ర ద్రష్ట)ఇంకా మరెందరో గురు స్వరూపాలు,మహాత్ములు ఇప్పటికి గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉన్నారు.ఆది శంకరులు,గణపతి ముని ఈ అరుణ గిరిని ఇది మహా మేరు శ్రీ చక్రం ఇంత పెద్ద శ్రీ చక్ర స్వరూపాన్ని మాములుగా ఎవరూ చూడలేరు,పూజించలేరు దీనికి ప్రదక్షిణ చేస్తే అంత పెద్ద శ్రీ చక్రాన్ని చూసిన అర్చించిన ఫలితమే వస్తుందని వాళ్ళు చెప్పారు.రామానుజులు ఇది స్వయంగా సుదర్శన గిరియే(సుదర్శన చక్ర స్వరూపం) అని చెప్పారు.సుబ్రహ్మణ్య అవతారమైన జ్ఞాన సంబంధర్ నాయనార్ కి ఒక్కడికే ఈ కలియుగంలో ఈ కొండ అరయని నల్లూర్(36కిలోమీటర్ల దూరం అరుణాచలం నుంచి)నుంచి ఒక మహా అగ్ని స్వరూపంగా(ఈ కొండ మొత్తం మంటలతో ఉన్నట్టు కృతయుగంలో ఈ గిరి అస్సలు స్వరూపంలో)కనిపించింది అని చెప్తారు.భగవాన్ రమణులకు తన జీవితాంతం తన తండ్రి పరమేశ్వరుడు అనే భావనలోనే కనిపించింది.కావ్య కంఠ గణపతి మునికి ఈ కొండ అర్ధ నారీశ్వర స్వరూపంగా కనిపించింది అని చెప్తారు.మిగతావాళ్ళు అందరూ పరమేశ్వరుడు అనే భావంతోనే చేశారు,చేస్తుంటారు కూడా.
No comments:
Post a Comment