Friday, April 28, 2023

మానవ జీవితంలో అనుభూతమయ్యేది బాధ ... బంధం.

 హరి: ఓం శ్రీ గురుభ్యోన్నమ: 🙏

మానవ జీవితంలో అనుభూతమయ్యేది బాధ ... బంధం.

గర్భస్త శిశువుగా ఉన్నప్పుడు  ఈ బాధ బంధమూ దూరం చేయవచ్చునా .. చేయ వచంటుంది వేదాంతం. 

అజ్ఞానాన్ని రూపుమాపుకొని పుడుతూనే జ్ఞానిగా పుట్టినవాడు అష్టావక్రుడు ... ఇది భారతీయ సనాతన ధర్మం. 

తెలుసుకునేదంతా భ్రమాజన్య జ్ఞానం. 

తెలిసీ తెలియనివాడుగా ఉండేవాడు జ్ఞాని .. ఆద్యంతములు కలిగినదానితో నాకు సంబంధం లేదు .

మహానుభావులు అజ్ఞానయుతమైన అంశములకు నోరు విప్పరు. 

వ్యావహారిక జ్ఞానం రాగద్వేషాదులతో కూడుకొని ఉన్నది. 

మానవులకు మాత్రమే ఉన్నది అన్యధా గ్రహణం ... అగ్రహణం .. బుధ్ధికి ఉన్న దోషములు. 

ఉన్న వస్తువుని గమనించలేకపోతుంది .. లేని వస్తువు కావాలనుకోవటం. 

విశేషాన్ని పొందటం ద్వారా నేను సంతృప్తి పడతాను .. ఇది అన్యధా గ్రహణం ... భ్రాంతి మయం. 

అన్ని విశేషముల యడల వైరాగ్య భావం కలిగినప్పుడే బయట పడతారు. 

ప్రతి బించేవన్నీ విశేషాలే .. కల విశేషం ... కల వెనుక ఉన్న ప్రకాశం సామాన్యం. 

జీవనం విశేషం .. జీవుడు సామాన్యం .. ఆత్మ సామాన్యం .. ఆత్మానుభవం విశేషం .. బ్రహ్మ సామాన్యం బ్రహ్మానుభూతి విశేషం. 

ఎరుక సామాన్యం ఎరుకానుభవం విశేషం. ఆత్మ మొదటి లక్షణం అవ్యవహారి. 

వైరాగ్యం వల్ల అన్యధా గ్రహణం పోయి సద్వస్తు జ్ఞానం .. జ్ఞానం వల్ల అగ్రహణం పోతుంది. 

ఎవరికైతే సాంఖ్య విచారణ అనుభవ నిర్ణయం అవుతుందో వారికే తారకం ... తారకం అనుభవానికి వస్తే అమనస్కం. 

ప్రతి ఆలోచన .. వ్యవహారం .. అనుభవాన్నిసాక్షిగా చూడాలి. 

సాక్షి సాధన ఎంత బలపడాలంటే నీ నిద్రకు నీకు సాక్షిత్వం తెలియాలి. .. నీ ఇంద్రియాలు మేల్కోవటం పడిపోవటం తెలియాలి. ఆ సాక్షి అవ్యవహారి ..పరిణామం లేదు. 

మార్పులు .. చేర్పులు.. సాధనలన్నీ అన్యధా .. అగ్రహణం తొలగించుకోవటానికే. 

అర్ధం అయినవాడికే సందేహం వస్తుంది .. ఆచరించని వారికి అర్ధం కాని వారికి సందేహం రాదు .. అసుర నాయకుడు. 

ఆధేయం శరీరం స్థూలం ... ఆధారం ప్రాణం సూక్ష్మం. పదార్ధాన్ని నడిపే చేతన శక్తి ప్రాణం. 

నా ఆకాంక్షలకు కారణం నా అంత: కరణ ... కర్మ త్రివిధంబులు .. కాయిక .. మానసిక.. వాచికములు. 

మానసిక.. శారీరక.. వాచిక కర్మ బ్రాహ్మీ భూత స్థితి లో చేయాలి 

ఎవరి మానసిక.. వాచిక .. శారీరక కర్మ దివ్యత్వంతో నిండి ఉంటుందో వారు దేవతలు. 

ఒక్క భారతీయ సనాతన ధర్మం మాత్రమే విగ్రహారాధన ఒప్పుకొన్నది. 

ఎవరి కర్మ దివ్యమో అక్కడ అహంకార నాశనం. ప్రతీ శ్వాస దైవీ స్థితిలో ఉండి తీసుకోవాలి. 

దివ్యత్వం అనే పరిధి బయటకు రాకుండా నిన్ను నీవు నియమించుకోవాలి. 

ఏ కర్మ దివ్యత్వమో అది పుణ్యం.. అన్నం బ్రహ్మేతి.. ప్రాణం బ్రహ్మేతి.. మనో బ్రహ్మేతి ...

యత్ కర్మ కృత్ తత్ ఫలం .. గీత 
ఏది ఎలా చేస్తావో అలా అనుభవించబడుతుంది. 

శారీరక.. మానసిక.. వాచిక కర్మలని దివ్యత్వం తో పూరించటం వలన వైరాగ్యం .. ప్రవృత్తి నుండి నివృత్తి మార్గం లో పరిణమిస్తారు. 

శ్రీ విద్యాసాగర్ స్వామి వారు 
అష్టావక్రగీత -11

జై గురుదేవ 🙏

🌹💐🌹💐🌹💐🌹💐🌹💐

No comments:

Post a Comment