Sunday, April 2, 2023

ప్రార్ధించండి...,

 *🕉️ జై శ్రీమన్నారాయణ🕉️🌺🙏ఓం నమో భగవతే వాసుదేవాయ🙏🌺*

🌷message of the day🌷

*_🌴 ప్రార్థించండి! వేకువనే లేచి దైవమును ప్రార్థించండి.. ప్రార్థన యొక్క శక్తిని గుర్తించి ప్రార్థించండి. దైవము తప్పక సమాధానం ఇస్తాడన్న విశ్వాసంతో ప్రార్ధించండి. మరొక దినం గడిపేందుకు అవకాశం ఇచ్చినందుకు ప్రార్ధించండి. ఎవరు ఎన్ని చెప్పినా వినకుండా ప్రార్ధించండి.. ఎన్ని పనులు ఉన్నా, ఎన్ని ఆటంకములు ఎదురైనా వాటిని లెక్కచేయక ప్రార్ధించండి.. హృదయ లోతుల్లోంచి గట్టిగా పిలవండి! ఆర్తితో పిలవండి!! పలికేవరకూ పట్టుదల విడువకండి. మీకు శుభ దినాలు ఎదురయ్యే రోజులూ ఎంతో దూరంలో లేవు. జన్మ ధన్యమయ్యే కాలం అతి దగ్గరలోనే ఉంది. పట్టుదల విడువకండి! ప్రార్ధించండి!! నిరుత్సాహ పడకండి! ప్రార్ధించండి! గట్టి వేడే పుట్టాలి.. పరమాత్మ కరిగి పరుగులెత్తి రావాలి!!🌴_*

No comments:

Post a Comment