[4/15, 17:01] +91 85198 60693: అరుణాచల గిరిప్రదక్షిణ ఇంత గొప్పది అని చెప్తున్నారు కదా ఎంతో మంది గొప్ప గొప్ప మహాత్ములు ఋషులు చేశారు అని చెప్తున్నారు కదా దీనికి ఏమైనా నియమాలు ఉన్నాయా? పార్వతి అమ్మవారు కూడా చేసింది అంటున్నారు కదా ఆ ప్రదక్షిణ గురించి వివరించండి?
[4/15, 17:03] +91 85198 60693: స:అరుణాచలం గిరి ప్రదక్షిణ కి ఒకే ఒక్క నియమం ఉంది అని చెప్తారు అదేంటంటే పరమేశ్వరుడి మీద పరిపూర్ణమైన భక్తి ఇదొక్కటి చాలు ఇంకేం అవసరం లేదు.వాడు స్నానం చేశాడా,ఉపవాసం తో చేశాడా,చెప్పులు వేసుకుని చేశాడా ఇవేమీ అక్కర్లేదు.ఇవన్నీ మనం పరమేశ్వర గౌరవార్థం కోసం చేసుకున్నవి స్నానం చేసి విభూతి నుదుటన రాసుకుని చక్కగా మనకి అనువైన దుస్తులు ధరించి గుండెల నిండా పరమేశ్వరుడిని నింపుకుని ఆయన మీద గౌరవంతో,భక్తితో,ప్రేమతో పాద రక్షలు ధరించకుండా ప్రశాంతంగా ఆయన గురించి చెప్పుకుంటూనో లేక ఆయన నామ స్మరణ చేస్తూ నడిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది కదా ఈ విధంగా చేస్తే బాగుంటుంది.అమ్మవారు ప్రదక్షిణ చేసేప్పుడు ఆమెని పరీక్షించడానికి ఆమె చేస్తున్న సమయంలో తిరునేర్ అన్నామలై ఆలయం దగ్గరికి వచ్చేటప్పటికి ఒకసారి అమ్మవారికి దర్శనమిచ్చి అదృశ్యం అయిపోతాడు తర్వాత పంచ శిఖర దర్శనం దగ్గర రెండవ సారి దర్శనమిచ్చి మళ్ళీ అదృశ్యమౌతాడు.చివరికి పవలకుండ్రు దగ్గర ఆమె పూర్ణ ప్రదక్షిణ ఫలితంగా అమ్మవారికి దర్శనం నిజంగా ఇచ్చి అర్ధ శరీరం ఇచ్చి అర్ధనారీశ్వరుడైయ్యాడు.పరమేశ్వరుడు ఈ ప్రదక్షిణలో లేదా చేద్దాం అనుకున్నవాళ్ళని ప్రతి భక్తుడిని పరీక్షించి తీరుతాడు.
No comments:
Post a Comment