Thursday, April 27, 2023

ప్రశ్న : ధ్యానము చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన అంశాలలేమిటి?

 🌹ప్రశ్న : ధ్యానము చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన అంశాలలేమిటి?

🌹భగవాన్ శ్రీ రమణ మహర్షి జవాబు :-

ఆత్మనిష్ఠలో ఉన్నవాడు ఆ స్థితినుంచి ఏ మాత్రమూ చలనం లేకుండా చూసుకోవాలి. తన సహజ స్థితి నుంచి కదలిన వానికి ఏవో జ్యోతులు కనబడవచ్చు. అసాధారణమైన ధ్వనులు వినబడవచ్చు. వీటి వల్ల మోసపోకూడదు, తనని తాను మరువకూడదు.

🌹ప్రశ్న :-ధ్యానమెట్లా చేయాలి?

🌹భగవాన్ శ్రీ రమణ మహర్షి జవాబు :-

నిజానికి ధ్యానమంటే ఆత్మనిష్ఠ. మనస్సులో భావాలు మోదులుతున్నప్పుడు వాటిని తొలగించటానికి చేసే యత్నాన్ని సాధారణంగా ధ్యానమంటారు. ఆత్మనిష్ఠ యే నీ సహజ స్థితి. నీవు నీవుగా ఉండు. అదే లక్ష్యం.

🌹ప్రశ్న :-భగవాన్, నేను ధ్యానం చేసేప్పుడల్లా నా తల వేడెక్కుతుంది, ఒళ్ళంతా మండుతుంది. దీనికి మందేమిటి?

🌹భగవాన్ శ్రీ రమణ మహర్షి జవాబు :-

మెదడుతో ఏకాగ్రతని చేస్తే వేడిమీ, ఒకోసారి తలనొప్పి కూడా కలుగుతాయి. ఏకాగ్రతని హృదయంలో చేయాలి. చల్లగా, హాయిగా ఉంటుంది. ప్రశాంతంగా ఉండు, నీ ధ్యానం తేలిక అవుతుంది. నీ మనస్సుని నిశ్చలంగా ఉంచు, ఏమైనా ఆలోచనలు వస్తే వాటిని మృదువుగా, నెమ్మదిగా తొలగించు. త్వరలోనే కృతార్ధుడవుతావు.

.... సేకరణ : నీ సహజస్థితిలో ఉండు, anglమూలం డేవిడ్ గాడ్ మ్యాన్, తెలుగు అనువాదం పింగళి సూర్య సుందరము

..... కోటంరాజు శ్రీనివాసరావు, హైదరాబాద్

No comments:

Post a Comment