Sunday, April 23, 2023

భగవాన్ శరీరం వదిలిన రోజు అని మనం అనుకుంటున్నాం... *కానీ నిజానికి భగవాన్ ఎప్పుడైతే మరణం అనుభవం పొంది తాను శరీరం కాదు అని తెలుసుకున్నారో ఆ రోజే ఆయన శరీరాన్ని వదిలేసిన రోజు....

 అరుణాచల👏
💐🌹💐🌹🙏🌹💐🌹💐
భగవాన్ శరీరం వదిలిన రోజు అని మనం అనుకుంటున్నాం...
*కానీ నిజానికి భగవాన్ ఎప్పుడైతే మరణం అనుభవం పొంది తాను శరీరం కాదు అని తెలుసుకున్నారో ఆ రోజే ఆయన శరీరాన్ని వదిలేసిన రోజు....*

 అయితే ఈ రోజు ఏప్రిల్ 14 ఆయన శరీరం భౌతికంగా చూసేవాళ్లకు కనబడకుండా పోయిన రోజు... ఆయన అరుణాచలం వచ్చిన తర్వాత లోకానికి తెలియడం జరిగింది....... కానీ ఆయనకు మాత్రం లోకం లేదు.... మహర్షి పైకి అందరితో ఉన్నట్టుగా కనబడినా తను మాత్రం తనతోనే ఉన్నారు.... తన స్వస్థితి ఏనాడు చెదరలేదు.....
భగవాన్ అరుణాచలునితో ప్రేమలో పడి ఆయన తప్ప ఇంకేమి అక్కర్లేదు అనే స్థితిలో గొప్ప ప్రేమికుడిగా తన చివరి శ్వాశ వరకు అలానే ఉండినారు....
కానీ మనమో.....
*రమణ భగవాన్ మాకు చాలా ఇష్టం..* అని చెపుతున్నామే తప్ప ఆయనతో ప్రేమలో పడలేదు... 
ఆయనతో నిజంగా ప్రేమలో పడితే అప్పుడు మాత్రమే తెలుస్తుంది ఆయన తప్ప ఇంకేమీ అక్కర్లేదని...
అప్పుడు ఇక మాటలు ఉండవు... ఆయనను ఆరాధించడం మాత్రమే ఉంటుంది... ఆరాధించడానికి మాటలు అవసరం లేదని అప్పుడు మాత్రమే తెలుస్తుంది....... *మనం భగవాన్ అంటే ఇష్టం అని మాట వరుసకు చెప్పి, మన జీవితంతో, మన సంసారంతో ప్రేమలో పడ్డాము.... ఎంత తేడానో చూడండి......*
నిజమైన ప్రేమికులు చూడండి, వాళ్లకు వాళ్ళిద్దరే తప్ప, ఇక మిగతా ప్రపంచం కనబడదు..... అలాంటి ప్రేమ, భక్తి మనకు భగవాన్ తో, అరుణాచలుడితో కలిగినప్పుడు తప్పక వాళ్లు మనతోనే ఉంటారు....
🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

No comments:

Post a Comment