*:::::::::: ఇన్సులేషన్ ::::::::::*
కరెంట్ తీగలు ముట్టు కున్నా షాక్ కొట్ట కుండా వుండేందుకు ఆ రాగి తీగలు మీద ప్లాస్టిక్ తొడుగు వుంటుంది . దీనిని ఇన్సులేషన్ అంటారు .
అలాగే
బయట వున్న రకరకాల వస్తువులు, మనుషులు, పరిస్థితులు, అలాగే జరుగుతున్న సంఘటనలు, కార్య క్రమాలు, మనలో షాక్ లాంటి భయాలు, ఆందోళనలు, కోరికలు,ఆశలు, ద్వేషాలు,
కోపాలు,చిరాకులు కలిగించకుండా జాగరూకత, అప్రమత్తత అనే ఇన్సులేషన్ తొడుగులు మనం వేసుకోవాలి.
అలాగే వివిధ భావాలు, ధర్మం పేరుతో చెలామణీ అవుతున్న అధర్మాలు, నమ్మకాలు మనలను ప్రలోభ పెట్టకుండా, ప్రభావితం అవకుండా మోసాలకు గురికాకుండా అప్రమత్తంగా వుండాలి.
అప్పుడు మనం ప్రశాంతంగా వుండగలము.
అప్రమత్తతే ధ్యానం.
*షణ్ముఖానంద 98666 99774*
No comments:
Post a Comment