Saturday, April 8, 2023

ప్రతి తండ్రి ఇలాంటి గుణపాఠం నేర్పగలిగితే, ప్రతి కొడుకు ఇలా కష్టార్జితం యొక్క గొప్పతనం తెలుసుకోగలిగితే,సమాజంలో సోమరి యువత ఉండదు, తల్లి తండ్రుల పై అధిక భారం ఉండదు...

 Good Story
ఒక తండ్రి తన ఆవేదన భార్య పై ఇలా వెళ్లగక్కుతున్నాడు... వాడికి కాస్త కుదురు నేర్పు, కష్టం నేర్పు,అతి గారాబం రేపటి రోజున వాడిని, నిన్ను బాధ పడేలా చేస్తుంది,ఎన్నో సార్లు చెప్తున్నా నీకు అర్థం కావట్లేదు అని బాధ పడ్డాడు...
వాడే తెలుసుకుంటాడు మీరెందుకు రోజు చెప్పిందే చెప్తారు అంటూ విసుక్కుంది...
 *వాడు తెలుసుకున్నాడో, లేదో ఒకసారి నీకు అర్థం అయ్యేలా తెలియజేస్తా అన్నాడు ...* అంటే??? అన్నది....
ఒక చిన్న పరీక్ష పెడతాను చూడు... నెగ్గితే నేను ఇక ఎప్పుడూ వాడి విషయంలో జోక్యం చేసుకోను అన్నాడు... సరే అన్నది,కొడుకును *కాపాడుకోవాలని prepare అయ్యింది త్రివేణి...* 
Rahul ఇలా రా...
ఏంటి నాన్న???
నాకు 21రోజుల పాటు రోజుకు వంద రూపాయలు సంపాదించి తీసుకొచ్చి ఇవ్వు... ఆ పైన నేను నిన్ను ఏ విషయంలోనూ restrict చెయ్యను అన్నాడు... ఓహ్ అంతేనా ... 100 ఏం కర్మ, 500 ఇస్తాను అని గొప్పగా చెప్పాడు... సరే తెచ్చి ఇవ్వు 500 అన్నాడు తండ్రి సుకుమార్... మొదటి రోజు గంటలో 500 తెచ్చి తండ్రి చేతికి ఇచ్చాడు... కొడుకు తెచ్చిన 500 లను అటు, ఇటు చూసి 2 ముక్కలు చేసాడు... కొడుకు నవ్వుతూ చించడానికి అడిగారా అన్నాడు... నేనేం చేస్తే నీకెందుకు తెచ్చి ఇవ్వడం నీ పని అని కరుకుగా చెప్పాడు తండ్రి... Ok మీ ఇష్టం అన్నాడు Rahul, కానీ తల్లి మాత్రం కొంచం బాధ పడింది ఎందుకంటే అవి ఆమె దాచుకున్న డబ్బు... మొదటి రోజు కొడుకుని హీరో చెయ్యాలని ఇచ్చేసింది...
2 వ రోజు... స్నేహితుల సాయం తో 2 గంటల్లో గట్టెక్కాడు... 3,4,5,.... ఇలా 18 రోజులు గడిచిపోయాయి... రోజూ 500 తేవడం ,తండ్రి చించడం పరిపాటి అయ్యింది... రోజులు గడుస్తున్న కొద్దీ గంటలు పెరుగుతూ వచ్చాయి, స్నేహితులు, బంధువులు అందరూ సాయం అయిపోతుంది... Rahul గుండెల్లో భయం, దిగులు పుట్టుకొచ్చాయి... ఇంకా ఎవరిని help అడగాలా అని చూస్తున్నాడు, తండ్రి ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేక పోతున్నాడు... *21 వ రోజు రానే వచ్చింది...* ఆ రోజు ఎవరి సాయం అందలేదు... వీధుల్లో తిరుగుతున్నాడు Rahul... 📦 Parcel office ముందు నుండి పోతున్నాడు, తన వయసు ఉన్న ఒక కుర్రాడు hello , కాళీ ఏనా అన్నాడు... అవును అన్నట్టు తల ఊపాడు... ఒక  load parcels  బండిలో ఎక్కించే పని ఉంది, ఈరోజు ఇద్దరు కురాళ్లు సెలవు పెట్టారు, 500 ఇస్తారు చేస్తావా అన్నాడు... ఆ మాట వినగానే కళ్ళు మెరిసాయి,గుండె ఒక్కసారిగా ధైర్యంగా కొట్టుకుంది, *ఇవ్వాళ నాన్న ముందు తల దించుకోవాలేమో అని ఇప్పటి వరకు భయపడింది అంతా పోయింది...* కానీ తనకి అలవాటు లేని పని, అయినా సరే ఒప్పుకుని పనిచేశాడు... సాయంత్రానికి ఇల్లు చేరాడు... రోజూలాగే తండ్రి చేతిలో 500 పెట్టాడు... *నోటు కాస్త తడిగా ఉంది ,కొడుకు మొఖం నీరసం ,నిస్సత్తువతో ఉన్న విషయం గమనించాడు...* అయినా ఏం తెలియనట్టు 500 చించబోయాడు... అంతే *రాహుల్ ఒక్క అరుపు అరిచాడు... ఆపు నాన్న... ఇది మాత్రం చించకు నీ కాళ్ళు పట్టుకుంటాను... అని కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు* ... తండ్రి ప్రేమగా పైకి లేవదీసి, చిరునవ్వుతో చెప్పాడు *ఇది మాత్రమే నీ కష్టార్జితం బాబు...* నాకు కావలసింది నీలో ఈ మార్పే అన్నాడు... తల్లి కూడా చాలా సంతోషించింది... *ఆనాటి నుండి రాహుల్ చదువుతో పాటు part time job చేస్తూ,తన అవసరాలకి తండ్రి దగ్గర చెయ్యి చాచలేదు, పైగా ఇంటి అవసరాలకు కొంత సొమ్మును అందించి తండ్రికి చేయూతగా నిలిచాడు...* ప్రతి తండ్రి ఇలాంటి గుణపాఠం నేర్పగలిగితే, ప్రతి కొడుకు ఇలా  కష్టార్జితం యొక్క గొప్పతనం తెలుసుకోగలిగితే,సమాజంలో సోమరి యువత ఉండదు, తల్లి తండ్రుల పై అధిక భారం ఉండదు...
🙏 *సర్వేజనా సుఖినోభవంతు* 🙏

No comments:

Post a Comment