Wednesday, April 5, 2023

మానవుని మూడు కోరికలు

 *"మానవుని మూడు కోరికలు"*  
      🪷🔥🪷🔥🪷🔥🪷
            🪷🔥🕉️🔥🪷
                  🪷🔥🪷
                        🪷

*"ప్రతి వ్యక్తీ అనుదినం ఈ మూడు కోరికలు ఆశిస్తే చాలు. ఈశ్వరారాధనలో స్వామిని అర్ధించవలసిన ఆకాంక్షను క్రింది శ్లోకంలో అమర్చి చెప్పారు మహాత్ములు..."*

*"అనాయా సేన మరణం, వినా దైన్యేన జీవనమ్ |*
*దేహాంతే తవ సాయుజ్యం దేహిమే పార్వతీపతే ||"*

*"ఆయాసం లేకుండా మరణం, దైన్యం లేని జీవితం, దేహం విడిచాక మోక్షం... ఈ మూడింటినీ ప్రసాదించ వలసినదిగా పార్వతీపతిని అర్ధిస్తున్నారు."*

*మొదటిది...*

*"ముందుగా ముగింపు సుఖంగా జరగాలనే కోరికను వ్యక్తం చేయడం చక్కని ఔచిత్యం. ప్రాణ ప్రయాణ సమయంలో కలిగే శారీరక, మానసిక యాతన మన ఆధీనంలో లేదు. కనుక ఆ సమయంలో ఎటువంటి యాతన ఉండకుండా; భగవత్ స్మరణతో అనాయాసంగా దేహాన్ని విడవడం ఒక వరం."*

*రెండవది...*

*"బతుకు గడవవలసిన తీరు. ఇది దైన్యం లేకుండా ఉండాలి. దిగులు, ఆధివ్యాదులు లేకుండా, మనసును కుంగదీసే పరిస్థితులు రాకుండా సాఫీగా జీవితం సాగాలనే అందరి కోరిక. అదే దీనిలో ఉంది."*

*మూడవది...*

*"అంతిమ లక్ష్యం, జీవితానికి చివరి గమ్యం మృత్యువు కాదు. మృత్యువు తరువాత జీవుని స్థితి ఏమిటి.. చేసిన దుష్కర్మలకు అనుగుణంగా దుర్గతులు తప్పవు. అందుకే మళ్ళీ దుర్గతుల పాలవకుండా, జన్మ పరంపరలకు లోనుకాకుండా పరమేశ్వరునిలో లీనం కావాలని కోరుకోవాలి."*

*"ఆ లక్ష్యం నెరవేరాలంటే జీవితమంతా సద్బుధ్ధితో, సత్కర్మలతో, సద్భక్తితో సాగాలి. అటువంటి జీవితమే దైన్యరహిత జీవితం. నిరంతరం భక్తితో సదాశివుని స్మరించే వారికి, ఆరాధించే వారికి ఈ మూడు కోరికలు నేరవేరతాయనడంలో సందేహం లేదు."*

   *|| ఓం నమః శివాయ ||*
          

No comments:

Post a Comment