Saturday, April 29, 2023

ఒక వేళ తార్కికంగా నీకు ఆత్మ వుందని నిరూపించినా నీ జీవన విధానంలో ఎలాంటి మార్పు వుండదు. ఆత్మ లేదని నిరూపించినా అంతే. ఎవరూ అతి సాధారణమయిన విషయం గురించి పట్టించుకోరు. అది నువ్వు ఎవరో తెలుసుకోవడం.

 *🌹. నిర్మల ధ్యానాలు - ఓషో  - 336 🌹*
*✍️.  సౌభాగ్య  📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. ఒక వేళ తార్కికంగా నీకు ఆత్మ వుందని నిరూపించినా నీ జీవన విధానంలో ఎలాంటి మార్పు వుండదు. ఆత్మ లేదని నిరూపించినా అంతే.  ఎవరూ అతి సాధారణమయిన విషయం గురించి పట్టించుకోరు. అది నువ్వు ఎవరో తెలుసుకోవడం. 🍀*

*మనిషి శతాబ్దాల నుండి అబద్దాలలో జీవిస్తున్నాడు. అందమైన అబద్ధాలు, కానీ అబద్ధాలే. మనం స్వర్గాన్నీ, నరకాన్నీ నమ్ముతూ పోతున్నాం. దేవుణ్ణి నమ్ముతూ పోతున్నాం. శాశ్వతత్వాన్ని, ఆత్మని నమ్ముతూ పోతున్నాం. ఇవన్నీ విశ్వాసాలు. విశ్వాసాలు అబద్ధాలు. నీ సొంతంగా ఏదీ తెలుసుకోకుండా ఆత్మ లోపల వుందో లేదో తెలుసుకోకుండా నమ్ముతున్నావు. ఒకవేళ తార్కికంగా నీకు ఆత్మ వుందని నిరూపించినా నీ జీవన విధానంలో ఎలాంటి మార్పు వుండదు.*

*ఆత్మ లేదని నిరూపించినా అంతే. ఆస్తికులున్నారు. నాస్తికులున్నారు. వాళ్ళందరూ ఒకే రకమయిన జీవితం గడుపుతున్నారు. దేవుణ్ణి నమ్మేవాళ్ళు, నమ్మనివాళ్ళు. ఒకే రకంగా బతుకుతున్నారు. నీకు సన్నిహితమయినది నీ ఆత్మ. నువ్వు దానిని పరిశోధించలేదు. అట్లాంటప్పుడు ఎక్కడో వున్న స్వర్గ నరకాల గురించి ఆరాటమెందుకు? ప్రార్థనాలయాల్లో అంతా వీటి చర్చే. వాదనలే. ఎవరూ అతి సాధారణమయిన విషయం గురించి పట్టించుకోరు. అది నువ్వు ఎవరో తెలుసుకోవడం.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment