*🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺🙏ఓం నమో భగవతే వాసుదేవాయ🙏🌺*
*_🌴నదులు ఎప్పుడూ వెనుకకు ప్రవహించవు. మద్యలో ఏదైనా అవరోధం వచ్చినా దానిని నెట్టివేయడమో లేదా పక్కకు జరిగి ముందుకు పోవడమో జరుగుతుంది తప్ప, వెనుకకు వెళ్ళే ప్రసక్తి లేదు! అలానే సాధకుడు ఐనవాడు ఎల్లపుడూ తన సాధనను ముందుకు సాగిపోయెలా చూసుకోవాలి. మద్యలో అనేకములైన చింతలు, కష్టములు, నష్టములు కలుగవచ్చును. కానీ వాటన్నింటినీ పక్కకి నెడుతూ ముందుకు సాగిపోవాలి. వెనుకడుగు వేయాలన్న ఆలోచనే చేయకూడదు. ఏ ఉద్దేశ్యముతో అయితే సాధన ప్రారంభించామో అది విజయవంతముగా పూర్తయ్యేవరకూ విశ్రమించకూడదు. అన్నింటి కన్నా ముఖ్యం, భగవంతునిపై గట్టి విశ్వాసంతో ఉండాలి. అడ్డంకులు, అవరోధములకు భయపడవద్దు. మన సాధనలో ఎదురయ్యే ప్రతీ అవరోధమును ఆయనే ఏదో విధముగా తొలగిస్తాడు. కొంచం కష్టమైనా సరే వెనుకడుగు మాత్రం వేయకండి. ముందుకు సాగడానికే సిద్ధపడి ఉండాలి.🌴_*
No comments:
Post a Comment