*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 324 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. నువ్వు పరిధి నించీ కేంద్రానికి వెళ్ళలేవు. ఎప్పుడు కేంద్రం నించే పరిధికి విస్తరిస్తావు. పరిధి అన్నది కేవలం ఛాయా మాత్రమైంది. 🍀*
*మన పునాదులు మన కేంద్రంలో వున్నాయి. మనం కేంద్రంలో ఒక వేళ కలుపు మొక్కల్ని నాటితే మనకు గులాబీ పూలు కావాలంటే కుదరదు. గులాబీపూలు కావాలంటే గులాబీ మొక్కల్ని పునాదుల్లో నాటాలి. అప్పుడే మృదువైన పూలు, మధురమయిన పరిమళం పరిసరాల్లో ప్రసరిస్తాయి. నువ్వు పరిధి నించీ కేంద్రానికి వెళ్ళలేవు. ఎప్పుడు కేంద్రం నించే పరిధికి విస్తరిస్తావు. పరిధి అన్నది కేవలం ఛాయా మాత్రమైంది. తరతరాలుగా మత పెద్దలు, నీతివాదులు పై నించీ సమన్వయాన్ని, సమశృతిని సాధిస్తామని చెబుతూ వచ్చారు.*
*పునాదుల్లో కలుపు మొక్కల్ని నాటి గులాబీల కోసం ఆశిస్తున్నాం. అవి రావు. లేదా మనం మోసంతో ప్లాస్టిక్ గులాబీ పూలని తెచ్చి కలుపు మొక్కలపై పెట్టి అలంకరిస్తాం. మనం యితర్లని మోసగించి చివరకు మనల్ని మనం మోసగించుకుంటాం. కానీ ప్లాస్టిక్పులు నిజమైన పూలు కావు. నీతి నిండిన పాత్రలు అలాంటివే. నిజమైన వ్యక్తిత్వాలు తయారు చేస్తే వచ్చేవి కావు. ధ్యానం గుండా సహజంగా ఏర్పడేవి.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment